భారీ ట్విస్ట్.. రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరిన కొండా సురేఖ

Konda Surekha seeks appointment with Revanth Reddy in a major twist
  • కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారంటూ ప్రచారం
  • రేవంత్ కు రాఖీ కట్టేందుకు అపాయింట్‌మెంట్ కోరిన కొండా సురేఖ
  • భేటీకి రేవంత్ అనుమతిస్తారా అనే దానిపై సర్వత్ర ఆసక్తి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ అత్యంత అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించనున్నారని, ఆమెతో స్వచ్ఛందంగా రాజీనామా చేయించేందుకు సీనియర్లు యత్నిస్తున్నారనే ప్రచారం ఊపందుకున్న సమయంలో... ఆమె సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు అపాయింట్‌మెంట్ కోరడం కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.


ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించిందని, ఆమెపై వేటు వేసేందుకు కూడా సిద్ధపడిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ రకమైన తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తతల నడుమ కొండా సురేఖ నేరుగా ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆసక్తి చూపడం ప్రాధాన్యత సంతరించుకుంది.


సోదరభావంతో రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు మంత్రి సమయం కోరగా... ఈ భేటీకి రేవంత్ రెడ్డి అనుమతి ఇస్తారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ముఖ్యమంత్రి భేటీకి సమయం కేటాయిస్తే, ఇది కేవలం పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడానికే పరిమితమవుతుందా? లేక ఇరు నేతల మధ్య నెలకొన్న కేబినెట్ వివాదాలు మరియు తాజా పరిణామాలపై ఏమైనా కీలక చర్చ జరుగుతుందా? అనేది కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కుతూహలాన్ని రేకెత్తిస్తోంది.

Advertisement
Konda Surekha
Revanth Reddy
Telangana Congress
Raksha Bandhan
Telangana Politics
Cabinet Reshuffle

More Telugu News