Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కల్యాణ్ బాబు' అంటూ పవన్ కు చిరంజీవి భావోద్వేగపూరిత రిప్లయ్

Chiranjeevi emotional reply to Pawan Kalyan as Kalyan Babu
Advertisement
  • చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్
  • చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న పవన్ కళ్యాణ్
  • తమ్ముడి పోస్ట్‌కు ఎమోషనల్‌గా స్పందించిన చిరంజీవి
  • నీ ధైర్యం, ప్రజాసేవ చూస్తుంటే గర్వంగా ఉందన్న మెగాస్టార్
Advertisement
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భావోద్వేగపూరిత సందేశం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. తమ్ముడి ఆత్మీయ పోస్ట్‌కు చిరంజీవి అంతే అనురాగంతో, ఎమోషనల్‌గా స్పందించారు. ప్రస్తుతం ఈ అన్నదమ్ముల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శనివారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని పవన్ కల్యాణ్ ఒక సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు. చిరంజీవి తనకు నటుడి కంటే ముందు నుంచే అసలైన హీరో అని పేర్కొంటూ, తన బాల్య జ్ఞాపకాలు, చెన్నైలో అన్నయ్య-వదినలతో గడిపిన రోజులు, ఆయన పడిన శ్రమ, సాధించిన విజయాలను పవన్ గుర్తుచేసుకున్నారు. తన సోదరుడికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

పవన్ కల్యాణ్ సందేశానికి స్పందించిన చిరంజీవి, "ప్రియమైన కల్యాణ్ బాబు, నీ మాటలు మన జీవితంలోని అమూల్యమైన జ్ఞాపకాలను గుర్తుచేస్తూ నన్ను తీవ్ర భావోద్వేగానికి గురిచేశాయి. ఒక అన్నయ్యగా అది నా బాధ్యత, ప్రేమ మాత్రమే. నేడు ప్రజల పట్ల నీకున్న నిబద్ధత, సాహసం, మాతృభూమిపై నీకున్న అపారమైన ప్రేమను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. కోట్లాది మందికి నువ్వు ఒక స్ఫూర్తిప్రదాతగా నిలిచావు" అని కొనియాడారు.

"నన్ను నీ హీరో అని అంటావు కానీ, నీ నిజాయతీ, నిస్వార్థమైన ప్రయాణం నాకు సైతం ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఈ అందమైన జ్ఞాపకాలను కానుకగా అందించినందుకు ధన్యవాదాలు కల్యాణ్ బాబు. నీ ప్రేమానురాగాలు నా జీవితంలో లభించిన గొప్ప ఆశీర్వచనాలలో ఒకటి" అంటూ చిరంజీవి తన వాత్సల్యాన్ని చాటుకున్నారు.
Advertisement
Advertisement
Chiranjeevi
Pawan Kalyan
Mega Brothers
Chiranjeevi Birthday
Janasena Party
Telugu Cinema

More Telugu News