ఆధార్ ఫొటో నచ్చలేదా? ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?
- ఆధార్ ఫొటో మార్పుపై లేని నిర్దిష్ట పరిమితి
- ఫొటో మార్చాలంటే ఆధార్ కేంద్రానికి వెళ్లాలి
- ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మార్చుకోవడం కుదరదు
- కేంద్రంలో బయోమెట్రిక్ పరిశీలన తర్వాత కొత్త ఫొటో
- ఫొటో మార్పుకు రూ.125 రుసుము
ఆధార్ కార్డులో ఫొటో సరిగా రాలేదని చాలామంది అసంతృప్తిగా ఉంటారు. కార్డు తీసుకునే సమయంలో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ తర్వాత ఫొటో మార్చుకోవచ్చా? ఇప్పటికే ఒకసారి మార్చితే మరోసారి మార్చే అవకాశం ఉందా? అనే సందేహాలు తలెత్తుతుంటాయి. దీనిపై యూఐడీఏఐ స్పష్టత ఇచ్చింది.
యూఐడీఏఐ అధికారిక సమాచారం ప్రకారం ఆధార్ ఫొటోను ఎన్నిసార్లు మార్చుకోవాలనే దానిపై నిర్దిష్ట పరిమితి లేదు. ఫొటో మార్చుకోవాలంటే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పూర్తి చేయడం సాధ్యం కాదు.
ఆధార్ కేంద్రంలో అప్‌డేట్ ఫామ్ నింపాలి. అనంతరం బయోమెట్రిక్ వివరాలను పరిశీలిస్తారు. అక్కడే కెమెరాతో కొత్త ఫొటో తీస్తారు. అప్‌డేట్ పూర్తయ్యాక అదే ఫొటో ఆధార్ కార్డులో కనిపిస్తుంది.
ఫొటో మార్పు కోసం రూ.125 రుసుము చెల్లించాల్సి రావచ్చు. ప్రక్రియ పూర్తయిన తర్వాత కొన్ని రోజుల్లో ఆధార్ వివరాలు అప్‌డేట్ అవుతాయి. అనంతరం కొత్త ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఫొటో మార్పు లేదా అప్‌డేట్ అభ్యర్థన తిరస్కరణకు గురైతే ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం యూఐడీఏఐ గ్రీవెన్స్ రెడ్రెసల్ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు. help@uidai.gov.inకు ఈమెయిల్ పంపొచ్చు. 1947 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయొచ్చు. అవసరమైతే యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చు.