రన్నర్‌ గుండెలో సమస్యను పసిగట్టిన యాపిల్‌ వాచ్‌.. చివరకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ!

Apple Watch detects heart problem in runner leading to open heart surgery
  • నిమిషానికి 219కు చేరిన ఓ రన్నర్‌ గుండె వేగం
  • యాపిల్‌ వాచ్‌ ఈసీజీలో ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ సంకేతాలు
  • వైద్య పరీక్షల్లో బయటపడిన పుట్టుకతో వచ్చిన గుండె సమస్య
  • సమస్యకు చికిత్సగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ
  • ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని కానర్‌ వెల్లడి
ట్రయాథ్లాన్‌ కోసం శిక్షణ తీసుకుంటున్న కానర్‌ అనే రన్నర్‌కు ఓ రోజు గుండె వేగం అసాధారణంగా పెరిగింది. వ్యాయామం చేస్తున్నా ఫిట్‌నెస్‌ మెరుగుపడకపోవడంతో అనుమానం వచ్చింది. ఆ సమయంలో యాపిల్‌ వాచ్‌లోని ఈసీజీ ఫీచర్‌తో పరీక్షించుకున్నాడు. అందులో ‘ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌’ సంకేతాలు కనిపించాయి. వైద్యులను సంప్రదించగా.. ఇంతకాలం తనకు తెలియని పుట్టుకతో వచ్చిన గుండె సమస్య బయటపడింది. చివరకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.

యాపిల్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో కానర్‌ అనుభవాన్ని తాజాగా వీడియో రూపంలో పంచుకుంది. ట్రయాథ్లాన్‌ శిక్షణ సమయంలో ఓ ఈవెంట్‌లో అతడి గుండె వేగం నిమిషానికి 219 సార్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. వెంటనే యాపిల్‌ వాచ్‌తో ఈసీజీ పరీక్షించుకోగా ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ సంకేతాలు కనిపించాయి.

దీంతో కానర్‌ వైద్యులను సంప్రదించాడు. తదుపరి పరీక్షల్లో పుట్టుకతోనే ఉన్న గుండె సమస్యను వైద్యులు గుర్తించారు. దానికి చికిత్సగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేశారు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని కానర్‌ తెలిపాడు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత తనకు కొత్త గుండె వచ్చినంత అనుభూతి కలుగుతోందని చెప్పాడు.

యాపిల్‌ వాచ్‌లోని ఈసీజీ ఫీచర్‌ సిరీస్‌ 4, ఆ తర్వాతి మోడళ్లలో అందుబాటులో ఉంది. అన్ని యాపిల్‌ వాచ్‌ అల్ట్రా మోడళ్లలోనూ ఈ సదుపాయం ఉంది. అయితే యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ మోడళ్లలో ఈ ఫీచర్‌ లేదు.
Advertisement
Apple Watch
Connor
Atrial Fibrillation
Open Heart Surgery
ECG feature
Heart health technology

More Telugu News