వచ్చే 6 నెలల్లో కొత్త చాట్‌జీపీటీ? స్క్రీన్ నుంచి మీటింగ్స్ వరకు అన్నీ గమనించే ఏఐ
- స్క్రీన్, మీటింగ్స్, కాల్స్‌ను ఏఐ అర్థం చేసుకోనుందని వెల్లడి
- ఏ సమాచారాన్ని పంచుకోవాలో వినియోగదారుడే నిర్ణయించుకోవచ్చని వివరణ
- మెయిల్స్, డాక్యుమెంట్లు, స్లాక్ వంటి వనరులకు యాక్సెస్ ఇవ్వొచ్చని వెల్లడి
- పని చేస్తుండగానే ఏఐ సూచనలు ఇవ్వగలదన్న ఆల్ట్‌మన్
- అనుమతి ఇస్తే కొన్ని పనులను ఏఐ స్వయంగా పూర్తి చేయగలదని వెల్లడి
మీరు కంప్యూటర్‌లో ఏం చేస్తున్నారు? ఎవరితో మీటింగ్‌లో ఉన్నారు? ఏం టైప్ చేస్తున్నారు? ఏ మెయిల్ రాస్తున్నారు? ఇవన్నీ అర్థం చేసుకుని అవసరమైన సమయంలో సాయం చేసే ఏఐ అసిస్టెంట్ వస్తే ఎలా ఉంటుంది? భవిష్యత్తులో చాట్‌జీపీటీ ఇలాంటి సామర్థ్యాలతో రావచ్చని ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ తెలిపారు.
స్క్రీన్‌పై ఏం జరుగుతుందో గమనిస్తూ..
జెడ్ ఫెలోస్ వ్యవస్థాపకుడు కోరీ లెవీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆల్ట్‌మన్ ఈ విషయాలను వెల్లడించారు. భవిష్యత్ చాట్‌జీపీటీ వినియోగదారుడి కంప్యూటర్ స్క్రీన్, మీటింగ్స్, కాల్స్‌ను నిరంతరం గమనిస్తూ సందర్భాన్ని అర్థం చేసుకునే స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు. ఇది ఆరు నెలల్లో అందుబాటులోకి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
అవసరమైన సమాచారానికే యాక్సెస్
వినియోగదారులు ఏ సమాచారాన్ని ఏఐతో పంచుకోవాలో వారే నిర్ణయించుకోవచ్చని ఆల్ట్‌మన్ తెలిపారు. టెక్స్ట్ మెసేజ్‌లు, ఈమెయిల్స్, డాక్యుమెంట్లు, స్లాక్ వంటి వనరులకు యాక్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఏఐ స్వయంగా నిర్ణయాలు తీసుకోదని.. వినియోగదారుడితో కలిసి పనిచేస్తూ సూచనలు ఇవ్వడం, అనుమతి ఉన్న పనులను పూర్తి చేయడం చేస్తుందని వివరించారు.
పని చేస్తూనే సూచనలు
ఉదాహరణకు ఓ స్టార్టప్ సీఈఓ కస్టమర్‌కు సేల్స్ పిచ్ రాస్తున్నారని అనుకుందాం. గతంలో ఆ కస్టమర్‌తో జరిగిన సంభాషణలు, సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించి ఏఐ అక్కడికక్కడే మెరుగైన సూచనలు ఇవ్వగలదు. వ్యూహాత్మక డాక్యుమెంట్ తయారుచేస్తున్నప్పుడు తప్పును గుర్తించి హెచ్చరించవచ్చు. అవసరమైతే అనుమతితో సంబంధిత పనిని కూడా పూర్తి చేయగలదు.
ఒక్కో ప్రశ్నకు సమాధానం దాటి..
ప్రస్తుతం ఏఐకి ఇచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పడం మాత్రమే ప్రధాన పని. భవిష్యత్ అసిస్టెంట్ మాత్రం యూజర్ పనితీరును అర్థం చేసుకుని స్పందించగలదని ఆల్ట్‌మన్ తెలిపారు. తాను పని చేసే విధానాన్ని కూడా ఇది మార్చగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు.
చాట్‌జీపీటీలో ఇప్పటికే గత సంభాషణల ఆధారంగా మెరుగైన సమాధానాలు ఇచ్చే మెమరీ సదుపాయం ఉంది. మ్యాక్ కంప్యూటర్లలో డెస్క్‌టాప్ కార్యకలాపాలను సురక్షితంగా నమోదు చేసి వెతుక్కునే ‘కంప్యూటర్ హిస్టరీ’ ఫీచర్ కూడా ఉంది. ఇది వినియోగదారుల అనుమతితో మాత్రమే పనిచేస్తుంది.