Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్.. నిషేధం కొనసాగింపు!

Jani Master gets shock from Film Federation as ban continues
Advertisement
  • జానీ మాస్టర్‌పై నిషేధం కొనసాగిస్తున్నట్టు తెలిపిన ఫిలిం ఫెడరేషన్
  • ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలే కారణమని స్పష్టీకరణ
  • డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సహకారం నిలిపివేస్తున్నట్టు ప్రకటన
  • పెద్దల మాట వినకుండా ఉప ఎన్నిక నిర్వహించడంపై తీవ్ర ఆగ్రహం
  • జానీ మాస్టర్ ఇచ్చిన రూ. 3 లక్షలు వెనక్కి పంపుతున్నట్టు వెల్లడి
Advertisement
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య (ఫిల్మ ఫెడరేషన్) గట్టి షాక్ ఇచ్చింది. ఆయనపై గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సమాఖ్య స్పష్టం చేసింది. బుధవారం జరిగిన ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినందుకే జానీ మాస్టర్‌పై ఈ చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.

ఈ సమావేశంలో డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుమలత తీరుపై కూడా ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సినీ పెద్దలు, నిర్మాతల మండలి సూచనలను కాదని, ఏకపక్షంగా డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఉప ఎన్నికలు నిర్వహించడాన్ని ఫెడరేషన్ తీవ్రంగా తప్పుపట్టింది.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఇకపై డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఎలాంటి సహకారం అందించబోమని ఫెడరేషన్ స్పష్టం చేసింది. అయితే, సామాన్య డ్యాన్సర్లకు వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. మిగతా 23 క్రాఫ్టులకు మాత్రం యథావిధిగా సహకారం కొనసాగుతుందని పేర్కొంది. అంతేకాకుండా, గతంలో జానీ మాస్టర్ ఫెడరేషన్‌కు ఇచ్చిన రూ. 3 లక్షల మొత్తాన్ని కూడా ఆయనకే తిరిగి పంపిస్తున్నట్లు వెల్లడించింది.
Advertisement
Advertisement
Jani Master
Telugu Film Federation
Dancers Union
Sumalatha
Tollywood News
Choreographer Jani Master

More Telugu News