అహ్మదాబాద్ సైబర్ ఫ్రాడ్‌లో పాక్, చైనా లింకులు.. 4,500 సిమ్ కార్డుల స్వాధీనం!
- రూ.1.5 కోట్ల ‘బాస్ స్కామ్’ కేసులో వెలుగులోకి అంతర్జాతీయ నెట్‌వర్క్
- నేరాలకు చైనాలో తయారైన మాల్‌వేర్, పాకిస్థాన్‌లోని కాల్ సెంటర్ వినియోగం
- గత నాలుగేళ్లుగా పాక్, చైనాకు ‘సైబర్‌క్రైమ్ యాజ్ ఎ సర్వీస్’ అందిస్తున్న ముఠా
అహ్మదాబాద్‌లో జరిగిన రూ.1.5 కోట్ల ‘బాస్ స్కామ్’ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మోసం వెనుక భారత్, చైనా, పాకిస్థాన్ దేశాలకు చెందిన అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 4,500 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
జూన్ నెలలో ఓ కంపెనీ ఉద్యోగికి వాట్సాప్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేరుతో నకిలీ మెసేజ్ వచ్చింది. అది నిజమని నమ్మిన ఉద్యోగి, సైబర్ నేరగాళ్ల ఖాతాకు రూ.1.5 కోట్లు బదిలీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, వెంటనే స్పందించి రూ.1.3 కోట్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ కేసును లోతుగా విచారించగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇమ్రాన్ అలీ పియాదా, ఇంజాముల్ అనే ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు తేలింది. వారిని ట్రాన్సిట్ వారెంట్లపై గుజరాత్‌కు తరలించి విచారించారు.
నిందితుల నుంచి పోలీసులు 4,500 సిమ్ కార్డులు, ఒకేసారి పలు సిమ్‌లు పనిచేసే పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఒక రూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ గేమింగ్, ఈ-కామర్స్ యాప్‌ల కోసం సుమారు 21,000 ఓటీపీలను సరఫరా చేసి రూ.21 లక్షలకు పైగా సంపాదించినట్లు తేలింది.
సాంకేతిక విశ్లేషణలో చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు అభివృద్ధి చేసిన మాల్‌వేర్‌ను ఈ మోసాలకు వాడినట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న ఓ కాల్ సెంటర్‌తో ముడిపడి ఉందని తేలింది. చైనా ఆధారిత వీపీఎన్ సర్వీసుల ద్వారా బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ ముఠా గత నాలుగైదేళ్లుగా పాకిస్థాన్, చైనాలోని నేరగాళ్లకు డమ్మీ సిమ్‌లు, ఓటీపీలు, వాట్సాప్ అకౌంట్ల రూపంలో ‘సైబర్‌క్రైమ్ యాజ్ ఎ సర్వీస్’ అందిస్తోందని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ తెలిపారు. ఈ సిమ్ కార్డులకు దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 251 సైబర్ ఫిర్యాదులతో సంబంధం ఉన్నట్లు తేలడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.