ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు.. హోమ్ లోన్ ఈఎంఐలపై డబుల్ ఎఫెక్ట్!
- ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ఆర్బీఐ కొత్త ముసాయిదా విడుదల
- ప్రతి 3 నెలలకు వడ్డీ రేట్లను సవరించాలని ప్రతిపాదన
- రుణగ్రహీతలపై మరింత వేగంగా రేట్ల కోత, పెంపు ప్రభావం
- ఆమోదం లభిస్తే 2027 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి
- పాత రుణాల మార్పునకు 2029 ఏప్రిల్ 1 వరకు గడువు
ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో గృహ, ఇతర రుణాలు తీసుకున్న వారికి 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) కీలకమైన మార్పులను ప్రతిపాదించింది. వడ్డీ రేట్ల మార్పులను మరింత వేగంగా రుణగ్రహీతలకు వర్తింపజేసేందుకు కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. అయితే, ఈ ప్రతిపాదనల వల్ల మీ నెలవారీ ఈఎంఐపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండదని గమనించాలి. ప్రస్తుతం ఇది కేవలం ముసాయిదా దశలోనే ఉంది.
ఈ ముసాయిదాపై అభిప్రాయాలు తెలిపేందుకు 2026 సెప్టెంబర్ 11 వరకు గడువు విధించారు. ఒకవేళ ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే, 2027 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. దీనివల్ల వడ్డీ రేట్ల కోత లేదా పెంపు ప్రభావం రుణగ్రహీతలపై చాలా వేగంగా పడనుంది.
ప్రతి 3 నెలలకు వడ్డీ రేట్ల సవరణ
ప్రస్తుతం చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఫ్లోటింగ్ రేట్ రుణాలపై వడ్డీ రేట్లను సంవత్సరానికి ఒకసారి మాత్రమే సవరిస్తున్నాయి. దీనివల్ల ఆర్బీఐ రెపో రేటు తగ్గించినా, దాని ప్రయోజనం వినియోగదారులకు చేరడానికి కొన్ని నెలల సమయం పడుతోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు, ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఫ్లోటింగ్ రేట్ రుణాలపై వడ్డీ రేట్లను గరిష్ఠంగా మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుంది. అంటే.. రెపో రేటు తగ్గితే ఆ ప్రయోజనం త్వరగా అందుతుంది, అదే సమయంలో రేటు పెరిగితే ఆ భారం కూడా అంతే వేగంగా పడుతుంది.
ఛాయిస్ ఫిన్‌సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ విజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. "తక్షణమే వడ్డీ రేటు తగ్గడం కంటే, సమయం, పారదర్శకతే ఇక్కడ వినియోగదారుడికి లభించే అసలైన ప్రయోజనం. రెపో రేటు కోత ప్రయోజనం ఇకపై నెలల తరబడి నిలిచిపోదు. అలాగే, రుణ ఒప్పందంలో ఏ బెంచ్‌మార్క్‌ను అనుసరిస్తున్నారు, ఎంత తరచుగా రేటు మారుతుందనేది స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది" అని వివరించారు.
పాత, కొత్త రుణాలపై ప్రభావం ఎలా?
ఈ ప్రతిపాదనలు కేవలం ఫ్లోటింగ్ రేట్ రుణాలకు మాత్రమే వర్తిస్తాయి. పర్సనల్, ఆటో లోన్లు చాలా వరకు స్థిర వడ్డీ రేటుతో ఉంటాయి కాబట్టి, వాటి ఈఎంఐలపై ఎలాంటి ప్రభావం ఉండదు.
ఇప్పటికే ఫ్లోటింగ్ రేటుపై రుణం తీసుకున్న వారు ఇప్పుడేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాత రుణాలను కొత్త విధానంలోకి మార్చుకోవడానికి 2029 ఏప్రిల్ 1 వరకు గడువు ఉంటుంది. వినియోగదారుడి అంగీకారంతో ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఈ మార్పు జరుగుతుంది.
కొత్తగా రుణం తీసుకునేవారు ఏం గమనించాలి?
కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారు కేవలం తక్కువ వడ్డీ రేటును మాత్రమే కాకుండా కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
1.స్ప్రెడ్: బ్యాంకులు తమ బెంచ్‌మార్క్ రేటుపై అదనంగా వసూలు చేసే మార్జిన్‌ను 'స్ప్రెడ్' అంటారు. ఇది రుణం మొత్తం కాలానికి స్థిరంగా ఉంటుంది కాబట్టి, తక్కువ స్ప్రెడ్ ఉన్న బ్యాంకును ఎంచుకోవడం మంచిది.
2.రీసెట్ ఫ్రీక్వెన్సీ: వడ్డీ రేటును ఎంత తరచుగా సవరిస్తారో స్పష్టంగా తెలుసుకోవాలి.
3.ఈఎంఐ హెడ్‌రూమ్: భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగితే ఈఎంఐ భారాన్ని మోయగలరా? లేదా? అనేది ముందే అంచనా వేసుకోవాలి.
ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 5.25% వద్ద స్థిరంగా ఉంది. భవిష్యత్తులో రేట్ల మార్పులు జరిగినప్పుడు, వాటి ప్రభావం ఈ కొత్త నిబంధనల వల్ల మరింత వేగంగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.