Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భోగాపురం విమానాశ్రయంలో బాధ్యతలు స్వీకరించిన సీఐఎస్ఎఫ్

CISF takes over security responsibilities at Bhogapuram Airport
Advertisement
  • భోగాపురం విమానాశ్రయం భద్రతలో కీలక ఘట్టం
  • రికార్డు సమయంలో విమానాశ్రయం పూర్తి కావడం పట్ల అభినందనలు తెలిపిన సీఐఎస్ఎఫ్ డీజీ
  • అత్యున్నత స్థాయి భద్రతను, స్నేహపూర్వకమైన సేవలను అందిస్తామని వెల్లడి
Advertisement

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతా వ్యవస్థలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్ ) అధికారికంగా తమ భద్రతా బాధ్యతలను స్వీకరించింది. ఈ సందర్భంగా విమానాశ్రయ ప్రాంగణంలో సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ రంజన్ పతాకాన్ని ఆవిష్కరించారు.


అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐఎస్ఎఫ్ డీజీ ప్రవీణ్ రంజన్ మాట్లాడుతూ, కేవలం 31 నెలల రికార్డు సమయంలో ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు అత్యున్నత స్థాయి భద్రతతో పాటు స్నేహపూర్వకమైన సేవలు అందించేందుకు సీఐఎస్ఎఫ్ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మీడియా మిత్రుల నుంచి నిరంతర సహకారం, పూర్తి మద్దతును ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement
Advertisement
Bhogapuram Airport
CISF
Praveen Ranjan
Alluri Sitarama Raju International Airport
Airport Security
Andhra Pradesh News

More Telugu News