Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ప్రాబ్లమ్ వల్లే ప్రమోషన్స్‌కి రాను.. కానీ యశ్ కోసమే నా నియమం బ్రేక్ చేశా: నయనతార

Nayanthara explains why she broke her rule for Yash at Toxic trailer launch
Advertisement
  • 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్ వేడుకకు హాజరైన నయనతార
  • సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉండే లేడీ సూపర్‌స్టార్
  • కేవలం హీరో యశ్ కోసమే ఈ కార్యక్రమానికి వచ్చానని వెల్లడి
  • ఆయన ఒక్క ఫోన్ కాల్ చేయడంతో హాజరయ్యానన్న నయన్
  • ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా 'టాక్సిక్' విడుదల
Advertisement
దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నయనతార, తన సినిమాల ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు ఆమె హాజరుకావడం చాలా అరుదు. అయితే, తన ఈ నియమాన్ని పక్కనపెట్టి, నిన్న‌ జరిగిన 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఆమె హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను ఎందుకు వచ్చానో కూడా ఈ వేదికపై ఆమె స్వయంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ.. "నేను ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరుకాకూడదని కాదు. నాకు ఆ పని సరిగ్గా చేతకాదు. అందుకే వాటికి దూరంగా ఉంటాను. కానీ, ఈ కార్యక్రమానికి రావడానికి హీరో యశ్ ఒక్కరే కారణం. ఆయన ఒక్క ఫోన్ కాల్ చేశారు, ఈ ఈవెంట్‌కు రావడానికి నాకు అది చాలు" అని తెలిపారు. కేవలం యశ్‌ కోసమే తాను ఈ కార్యక్రమానికి వచ్చానని స్పష్టం చేశారు.

యశ్‌తో కలిసి పనిచేసిన అనుభవం గురించి చెబుతూ.. "చాలా మంది పెద్ద స్టార్స్ ఉంటారు. కానీ, యశ్‌ను మొదటిసారి కలిసినప్పుడు, తెరపై ఆయనకున్న లార్జర్-దెన్-లైఫ్ ఇమేజ్ నిజ జీవితంలో కూడా కనిపించింది. ఆయన వ్యక్తిత్వం కూడా అంతే గొప్పది" అని ప్రశంసించారు.

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన 'టాక్సిక్' చిత్రంలో యశ్, నయనతారతో పాటు కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
Advertisement
Advertisement
Nayanthara
Yash
Toxic Movie Trailer Launch
Geethu Mohandas
Toxic Movie Cast
KVN Productions

More Telugu News