దృశ్యం సినిమాను మించిన క్రైమ్: భర్తను చంపి, రెండేళ్లు ఆస్ట్రేలియాలో ఉన్నాడంటూ భార్య నాటకం
- భర్తను హత్య చేసి ఫ్యాక్టరీలో కాంక్రీట్ కింద పూడ్చిపెట్టిన భార్య
- రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్నాడని బంధువులను నమ్మించిన వైనం
- బంధువుకు వచ్చిన అనుమానంతో బయటపడిన దారుణ హత్య
- భార్య, ఆమె ప్రియుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
- అవశేషాలను వెలికితీసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన అధికారులు
థ్రిల్లర్ సినిమా 'దృశ్యం'ను తలపించేలా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి, రెండేళ్లుగా అతను ఆస్ట్రేలియాలో ఉన్నాడని బంధువులను నమ్మించిన ఓ భార్య నాటకం బట్టబయలైంది. పోలీసులు ఈ మిస్సింగ్ కేసు మిస్టరీని ఛేదించి, ఫ్యాక్టరీలో కాంక్రీట్ నేల కింద 12 అడుగుల లోతులో పాతిపెట్టిన మృతుడి అస్థిపంజరాన్ని వెలికితీశారు. ఈ ఘటనలో మృతుడి భార్య పృథ్వీ అలియాస్ భూమిబెన్, ఆమె ప్రియుడు నీలేశ్ కఛాటియా, అతని స్నేహితుడు బల్వీర్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
జిగ్నేశ్ మావడియా అనే వ్యక్తి కనిపించడం లేదంటూ అతడి సోదరుడు ఈ ఏడాది జులై 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, దాదాపు రెండేళ్లుగా తన భర్త జిగ్నేశ్ పని మీద ఆస్ట్రేలియా వెళ్లాడని, అక్కడి కంపెనీ నిబంధనల ప్రకారం ఫోన్‌లో మాట్లాడటానికి అనుమతి లేదని భార్య పృథ్వీ బంధువులను నమ్మిస్తూ వచ్చింది. ఇటీవల జిగ్నేశ్ బంధువు ఒకరు ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుని, జిగ్నేశ్ చిరునామా, కాంటాక్ట్ వివరాలు అడగటంతో పృథ్వీ తడబడింది. ఆమె సమాచారం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం బలపడి పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పృథ్వీ తన మాజీ ప్రియుడు నీలేశ్‌తో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం రచించినట్లు తేలింది. 2024 మే 31వ తేదీ రాత్రి, మద్యం పార్టీ పేరుతో జిగ్నేశ్‌ను ఒక పారిశ్రామిక షెడ్డుకు పిలిచారు. అక్కడ అతడికి మద్యంలొ సైనైడ్ కలిపి ఇచ్చి హత్య చేశారు. అనంతరం, అక్కడే 12 అడుగుల లోతైన గొయ్యి తవ్వి, మృతదేహాన్ని పూడ్చిపెట్టి, దానిపై ఒక అడుగు మందంతో కాంక్రీట్ వేశారు.
నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత, వారి సమక్షంలోనే కాంక్రీట్‌ను పగలగొట్టి అస్థిపంజరాన్ని వెలికితీసినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రతిభ తెలిపారు. పవర్ టూల్స్ సహాయంతో కాంక్రీట్‌ను తొలగించామని ఆమె పేర్కొన్నారు. లభ్యమైన అవశేషాలు జిగ్నేశ్‌వి అవునో కాదో నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ నిపుణులకు పంపినట్లు వెల్లడించారు. నిందితులపై హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.