Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక్క టికెట్‌తో మారిన తలరాత.. వేల కోట్లు గెలుచుకున్న అమెరికా వ్య‌క్తి!

Mega Millions fate changed with one ticket the biggest lottery of 2026
Advertisement
  • ఫ్లోరిడాలో వ్యక్తికి 803 మిలియన్ డాలర్ల మెగా మిలియన్స్ జాక్‌పాట్
  • మంగళవారం తీసిన డ్రాలో ఒకే ఒక్క టికెట్‌కు తగిలిన బహుమతి
  • విజేతకు 345.5 మిలియన్ డాలర్ల ఏకమొత్తం లేదా 30 ఏళ్ల వాయిదాల ఆప్షన్
  • 2026లో ఇదే అతిపెద్ద లాటరీ బహుమతి అని ప్రకటన
  • 38 డ్రాల తర్వాత విజేతను ప్రకటించిన మెగా మిలియన్స్
Advertisement
అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక వ్యక్తిని అదృష్టం తలుపు తట్టింది. మెగా మిలియన్స్ లాటరీలో ఏకంగా 803 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 7,681 కోట్లు) భారీ జాక్‌పాట్‌ను ఒక్కరే గెలుచుకున్నారు. మంగళవారం జరిగిన డ్రాలో ఈ విజేతను ప్రకటించారు. ఈ అదృష్ట టికెట్‌ను ఫ్లోరిడాలోని బ్రాడెన్‌టన్‌లో ఉన్న వావా కన్వీనియన్స్ స్టోర్‌లో కొనుగోలు చేసినట్లు లాటరీ అధికారులు వెల్లడించారు.

లాటరీ అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం.. 34, 48, 49, 59, 70 వైట్ బాల్స్, 12 గోల్డ్ మెగా బాల్ నంబర్‌ను సరిగ్గా ఊహించిన టికెట్‌కు ఈ జాక్‌పాట్ దక్కింది. ఇప్పుడు ఈ భారీ మొత్తాన్ని ఎలా స్వీకరించాలనే దానిపై విజేత కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పన్నులు మినహాయించక ముందు సుమారు 345.5 మిలియన్ డాలర్లను ఏకమొత్తంగా తీసుకోవచ్చు. లేదా పూర్తి జాక్‌పాట్ మొత్తాన్ని 30 సంవత్సరాల పాటు వార్షిక వాయిదాల రూపంలో స్వీకరించే అవకాశం కూడా ఉంది.

ఈ చారిత్రక విజయంపై ఫ్లోరిడా లాటరీ సెక్రటరీ రెజినాల్డ్ డిక్సన్ స్పందిస్తూ.. "ఫ్లోరిడాకు చెందిన కొత్త మెగా మిలియన్స్ జాక్‌పాట్ విజేతకు మా అభినందనలు. ప్రతి టికెట్ ఒక కలను నిజం చేసే అవకాశాన్ని కలిగి ఉంటుందని ఈ గెలుపు గుర్తుచేస్తుంది. మా లాటరీ ప్లేయర్ల మద్దతు వల్లే రాష్ట్రవ్యాప్తంగా విద్యకు నిధులు సమకూరుతున్నాయి" అని సీబీఎస్ న్యూస్ కథనంలో పేర్కొన్నారు.

ఫ్లోరిడా చట్టాల ప్రకారం లాటరీ గెలుపుపై రాష్ట్ర పన్ను ఉండదు. కాబట్టి విజేత కేవలం ఫెడరల్ ఆదాయపు పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. డ్రా జరిగిన తేదీ నుంచి 180 రోజుల్లోగా బహుమతిని క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే, విజేత తన వివరాలను 90 రోజుల వరకు గోప్యంగా ఉంచుకునే వెసులుబాటు కల్పించారు. ఈ జాక్‌పాట్ 2026లో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద లాటరీ బహుమతి కావడం విశేషం. అంతేకాకుండా మెగా మిలియన్స్ చరిత్రలోనే ఇది 10వ అతిపెద్ద జాక్‌పాట్‌గా నిలిచింది. సుమారు 29.04 కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఇంతటి భారీ జాక్‌పాట్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. గత మార్చి నుంచి వరుసగా 38 డ్రాలలో ఎవరికీ జాక్‌పాట్ తగలకపోవడంతో ప్రైజ్ మనీ ఈ స్థాయికి చేరింది. ఈ గెలుపు తర్వాత మెగా మిలియన్స్ జాక్‌పాట్ తదుపరి డ్రా కోసం 50 మిలియన్ డాలర్లకు రీసెట్ అయింది.
Advertisement
Advertisement
Mega Millions
Florida Lottery
Jackpot Winner
803 Million Dollars
Bradenton Florida
Mega Millions Winning Numbers

More Telugu News