Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందూ మహాసముద్రంలో స్టార్‌షిప్ వ్యోమనౌక సేఫ్ ల్యాండింగ్

Starship spacecraft safe landing in the Indian Ocean
Advertisement
  • టెక్సాస్ నుంచి విజయవంతంగా దూసుకెళ్లిన స్టార్‌షిప్ ఫ్లైట్-13 
  • ప్రయోగంలో భాగంగా 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన వైనం 
  • బూస్టర్ రాకెట్ ఇంజిన్ లోపంతో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో క్రాష్ ల్యాండింగ్
Advertisement
అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రముఖ ప్రైవేట్ సంస్థ స్పేస్‌ఎక్స్ మరో చారిత్రక మైలురాయిని దాటింది. టెక్సాస్‌లోని బోకా చిగా వద్ద గల స్టార్‌బేస్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన "స్టార్‌షిప్ ఫ్లైట్-13" రోదసిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. భవిష్యత్తులో మానవులను చంద్రుడు, అంగారక గ్రహంపైకి తీసుకెళ్లేందుకు, పూర్తిస్థాయి పునర్వినియోగ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు స్పేస్‌ఎక్స్ చేపట్టిన ఈ ప్రయోగం అంతరిక్ష చరిత్రలో ఎంతో కీలకమైనదిగా నిలిచింది.

శనివారం ఉదయం నింగిలోకి లేచిన ఈ అత్యంత శక్తిమంతమైన రాకెట్, నిర్ణీత సమయానికి అంతరిక్షంలోకి చేరుకుంది. ప్రయోగం ప్రారంభమైన రెండు నిమిషాల తర్వాత ప్రధాన రాకెట్ నుంచి బూస్టర్ విభాగం వేరైంది. అయితే, తిరోగమన దిశలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలో ల్యాండ్ కావాల్సిన 'బూస్టర్-20' రాకెట్ ఇంజిన్ స్టార్టింగ్ సమస్యల వల్ల నియంత్రణ కోల్పోయి సముద్రంలో ల్యాండ్ కాకుండా దెబ్బతింది.

మరోవైపు ప్రధాన వ్యోమనౌక (స్టార్‌షిప్-40) అంతరిక్షంలో ప్రయాణిస్తూ, దాదాపు 20 నెక్స్ట్ జనరేషన్ 'స్టార్‌లింక్ వెర్షన్-3' ఇంటర్నెట్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి విడుదల చేసింది. అనంతరం ప్లాన్ చేసినట్లే గంటన్నర ప్రయాణం తర్వాత భూ వాతావరణంలోకి పునఃప్రవేశించి, హిందూ మహాసముద్రంలో అత్యంత సురక్షితంగా నీటిపై పడి (సోఫ్ట్ స్ప్లాష్ డౌన్) తేలియాడింది. స్టార్‌షిప్ వ్యోమనౌక సముద్రంలో క్షేమంగా ల్యాండ్ కావడం ఇదే తొలిసారి కావడంతో, "ఇది ఎంతో సంతోషకరమైన దృశ్యం" అని స్పేస్‌ఎక్స్ బృందం కొనియాడింది. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement
SpaceX
Starship Flight 13
Indian Ocean landing
Elon Musk
Starlink satellites
Starbase Texas

More Telugu News