వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌పై కేసు నమోదు

Case registered against former YCP MLA Kaile Anil Kumar
  • నిన్న పామర్రు పోలీస్ స్టేషన్‌లో హంగామా సృష్టించిన అనిల్
  • తమ విధులను అడ్డుకున్నారంటూ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు

పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కైలే అనిల్‌పై పామర్రు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. సోషల్ మీడియా ఫిర్యాదు వ్యవహారానికి సంబంధించి నిన్న తన అనుచరులతో కలిసి పామర్రు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కైలే అనిల్, అక్కడ తీవ్ర స్థాయిలో హంగామా సృష్టించిన విషయం తెలిసిందే.


ఈ క్రమంలో విధుల్లో ఉన్న తమను అడ్డుకోవడమే కాకుండా స్టేషన్ పరిసరాల్లో రచ్చ చేశారని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కైలే అనిల్, ఇతర వైసీపీ నాయకులపై 126(2), 221 రెడ్ విత్ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement
Kaile Anil Kumar
YSRCP
Pamarru Police Station
Former MLA
Police Case
Andhra Pradesh Politics

More Telugu News