అల్లూరి జిల్లాలో పేలుడు ప్రమాదం.. ఐదుగురి మృతి
- రోడ్డు పనుల కోసం కొండను పేల్చుతుండగా ఘటన
- ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి
- మృతుల్లో టీచర్, డ్రైవర్, ముగ్గురు కూలీలు
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు నిర్మాణ పనుల కోసం కొండను పేల్చే క్రమంలో జరిగిన పేలుడులో ఐదుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. అనంతగిరి మండలం పినకోట సమీపంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొండను తొలగించేందుకు కార్మికులు జిలెటిన్ స్టిక్స్‌ను ఉపయోగించి పేలుడుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ టిప్పర్ లారీ పేలుడు ధాటికి అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ దుర్ఘటనలో ఒక టీచర్, టిప్పర్ డ్రైవర్‌తో పాటు ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతులను టీచర్ సునీత (వైజాగ్), మణి (దేవరాపల్లి), నారాయణ రావు (చీడకాడ), పవన్ కుమార్ (కడప)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.