రామమందిరం విరాళాల కేసు.. మోదీకి రాహుల్‌, ఖర్గే లేఖ

National
Advertisement
  • స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్‌
  • ట్రస్ట్‌ లెక్కలు బహిర్గతం చేయాలన్న కాంగ్రెస్‌
  • భక్తుల్లో మోసపోయామన్న భావన కలుగుతోందని వెల్లడి
  • ప్రధాని మౌనం సరికాదన్న కాంగ్రెస్‌ అగ్రనేతలు
  • నియామకాలు కేంద్రం ఆధ్వర్యంలోనే జరిగాయని వ్యాఖ్య
Advertisement
అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు రాజకీయంగా మరోసారి దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంయుక్తంగా లేఖ రాశారు. భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకల వినియోగంపై పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌లో రూ.వేల కోట్ల విరాళాల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. భక్తులు విశ్వాసంతో సమర్పించిన కానుకలపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన వల్ల లక్షలాది మంది భక్తులు మోసపోయిన భావనలో ఉన్నారని తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రస్ట్‌ ఏర్పాటును పార్లమెంట్‌లో ప్రధానమంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ట్రస్ట్‌ సభ్యుల నియామకాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగాయని పేర్కొన్నారు. ట్రస్ట్‌లోని పలువురు సభ్యులకు ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌తో సంబంధాలు ఉన్నాయని లేఖలో ఆరోపించారు. మాజీ ప్రధాన కార్యదర్శి కూడా ప్రధానమంత్రికి సన్నిహితుడేనని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మౌనం సరికాదని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడ్డారు. ట్రస్ట్‌ ఆర్థిక వ్యవహారాలపై పూర్తిస్థాయి స్వతంత్ర విచారణకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నగదు, బంగారం, వెండి సహా భక్తులు సమర్పించిన అన్ని కానుకల లెక్కలు ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. పదవులు, పలుకుబడి చూడకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

విరాళాల లెక్కల్లో అక్రమాలు జరిగి సుమారు రూ.7 కోట్ల విలువైన నగదు, నగలు దారి మళ్లినట్లు సమాచారమొచ్చిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ట్రస్ట్‌ ఖాతాల పరిశీలనతో పాటు నగదు లెక్కింపు కేంద్రాల పనితీరును కూడా ఆ బృందం పరిశీలిస్తోంది. ఈ కేసు పురోగతిపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు కూడా కోరింది.

ఇప్పటివరకు ఆలయ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు, ట్రస్ట్‌కు అనుబంధంగా పనిచేసే వ్యక్తులు కలిపి ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగదు లెక్కింపు సమయంలో భద్రతా లోపాలు, అనధికార ప్రవేశం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నగదు లెక్కింపు కేంద్రాల్లో బయోమెట్రిక్‌ నమోదు, తప్పనిసరి తనిఖీలు, పోలీసు పర్యవేక్షణ వంటి అదనపు భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Rahul GandhiNarendra ModiRam Mandir donation caseMallikarjun KhargeAyodhya Ram MandirSIT investigation

More Telugu News

సన్నబియ్యం ధరలకు కళ్లెం.. తెలంగాణలో గరిష్ఠ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం

01 Nov, 08:34

ఢిల్లీ ర్యాలీపై వినూత్న పిలుపు.. నిరసనతో పాటు షాపింగ్ కూడా చేయాలన్న రాహుల్

01 Nov, 08:32

కడప, పులివెందులలో టెన్షన్.. వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య తోపులాట

01 Nov, 08:11

నెట్స్‌లో కోహ్లీకి చుక్కలు.. ఎవరీ అకీబ్ నబీ?

01 Nov, 08:08

ఏపీలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం.. బారులు తీరిన ఓటర్లు

01 Nov, 07:59

‘ఇరుముడి’ మేకర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు

01 Nov, 07:47

పసిడి ప్రియులకు ముందే దీపావళి.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

01 Nov, 07:34

అక్రమ మైనింగ్ కేసు: మాజీ మంత్రి కాకాణి అనుచరుడికి పోలీసుల నోటీసులు

01 Nov, 07:17

ఐఏఎస్ దంపతులకు 36 విల్లాలు.. ఒక్కోటి రూ. 15 లక్షలే: ఏసీబీ దర్యాప్తు షురూ!

01 Nov, 07:13

పోలింగ్‌కు ముందు పులివెందులలో దుండగుల ఘాతుకం

01 Nov, 06:59

ధనుష్ సంచలనం: పక్కా స్కెచ్‌తో రాజకీయాల్లోకి?.. 3000 మంది లాయర్లతో కొత్త వ్యూహం!

01 Nov, 06:48

కురుపాం టీడీపీ ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రచారంలో ఉద్రిక్తత

01 Nov, 06:31

అది సినిమా కాదు, చరిత్ర.. సీత పాత్రపై సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు

01 Nov, 06:24

'ఓట్ చోరీ'పై నిరసన.. రాహుల్, రేవంత్‌పై కేటీఆర్ ఘాటు సెటైర్లు

01 Nov, 06:21

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06
..More Telugu News