రష్మిక మందన్న సక్సెస్‌కు అదే కారణం.. బృందా మాస్టర్‌ ప్రశంసలు

Entertainment
Advertisement
  • మైసా చిత్రంలో నటిస్తున్న రష్మిక మందన్న
  • ఈ సినిమాలో ఓ పాట కొరియోగ్రాఫ్‌ చేస్తున్న బృందా మాస్టర్‌
  • రష్మిక కష్టం, ప్రిపరేషన్ అద్భుతమని ప్రశంస
  • అంకితభావమే ఆమె విజయానికి కారణమన్న మాస్టర్‌
  • ఎంత నొప్పితో ఉన్నా ఫోకస్‌ మాత్రం తగ్గదని వెల్లడి
  • ఇలాంటి హీరోయిన్లు అరుదుగా ఉంటారని ప్రశంస
Advertisement
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అంకితభావమే ఆమె విజయానికి ప్రధాన కారణమని ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ప్రశంసించారు. ప్రస్తుతం దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ‘మైసా’ చిత్రంలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్న ఆమె.. రష్మిక పనితీరుపై సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు చేశారు.

‘‘రిహార్సల్స్‌ నుంచి షూటింగ్‌ వరకు నువ్వు పడిన కష్టం, ప్రిపరేషన్‌ అద్భుతం. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఇంత క్రమశిక్షణ, అంకితభావం, కష్టపడే తత్వం ఉన్న హీరోయిన్‌ను చాలా అరుదుగా చూశాను. నేను చెప్పిన ప్రతి కరెక్షన్‌ను చిరునవ్వుతో స్వీకరించి వెంటనే అమలు చేశావు. నొప్పిలో ఉన్నా నీ ఫోకస్‌ ఏమాత్రం తగ్గదు. ఈ సినిమా కోసం నువ్వు చేసిన శ్రమ ప్రేక్షకులకు తెరపై స్పష్టంగా కనిపిస్తుంది’’ అంటూ బృందా మాస్టర్ రాసుకొచ్చారు.

‘మైసా’ చిత్రంలో రష్మిక ఓ గోండ్ గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది. భావోద్వేగాలతో పాటు శారీరకంగా కూడా సవాల్ విసిరే ఈ పాత్రపై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం జేక్స్ బిజోయ్ అందిస్తుండగా, అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Rashmika MandannaBrinda MasterMaisa MovieRavindra PulleTelugu Cinema NewsRashmika Mandanna Maisa

More Telugu News

సన్నబియ్యం ధరలకు కళ్లెం.. తెలంగాణలో గరిష్ఠ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం

01 Nov, 08:34

ఢిల్లీ ర్యాలీపై వినూత్న పిలుపు.. నిరసనతో పాటు షాపింగ్ కూడా చేయాలన్న రాహుల్

01 Nov, 08:32

కడప, పులివెందులలో టెన్షన్.. వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య తోపులాట

01 Nov, 08:11

నెట్స్‌లో కోహ్లీకి చుక్కలు.. ఎవరీ అకీబ్ నబీ?

01 Nov, 08:08

ఏపీలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం.. బారులు తీరిన ఓటర్లు

01 Nov, 07:59

‘ఇరుముడి’ మేకర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు

01 Nov, 07:47

పసిడి ప్రియులకు ముందే దీపావళి.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

01 Nov, 07:34

అక్రమ మైనింగ్ కేసు: మాజీ మంత్రి కాకాణి అనుచరుడికి పోలీసుల నోటీసులు

01 Nov, 07:17

ఐఏఎస్ దంపతులకు 36 విల్లాలు.. ఒక్కోటి రూ. 15 లక్షలే: ఏసీబీ దర్యాప్తు షురూ!

01 Nov, 07:13

పోలింగ్‌కు ముందు పులివెందులలో దుండగుల ఘాతుకం

01 Nov, 06:59

ధనుష్ సంచలనం: పక్కా స్కెచ్‌తో రాజకీయాల్లోకి?.. 3000 మంది లాయర్లతో కొత్త వ్యూహం!

01 Nov, 06:48

కురుపాం టీడీపీ ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రచారంలో ఉద్రిక్తత

01 Nov, 06:31

అది సినిమా కాదు, చరిత్ర.. సీత పాత్రపై సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు

01 Nov, 06:24

'ఓట్ చోరీ'పై నిరసన.. రాహుల్, రేవంత్‌పై కేటీఆర్ ఘాటు సెటైర్లు

01 Nov, 06:21

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06
..More Telugu News