'అభయ' కార్యక్రమాన్ని ప్రారంభించిన అనిత

Andhra
Advertisement
  • మహిళల భద్రత కోసం అనకాపల్లి పోలీసులు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్న అనిత
  • చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలని సూచన
  • బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పిల్లలకు హితవు
Advertisement
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు చాలా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని వేంపాడు టోల్ ప్లాజా సమీపంలోని భారతి కన్వెన్షన్‌లో 'అభయ' కార్యక్రమాన్ని హోం మంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా 'అభయ' పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, 'మహిళల భద్రత - మా బాధ్యత' అంటూ అనకాపల్లి పోలీసులు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 

ఎన్నో పోరాటాల వలన మహిళలకు స్వేచ్ఛ వచ్చిందని గుర్తు చేశారు. మహిళలకు ధైర్యం కల్పించడానికి 'అభయ' కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభించారని తెలిపారు. చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు. శక్తి యాప్, శక్తి టీమ్స్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లలను తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని... కష్టపడి చదువుకొని, ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఈ సందర్భంగా పిల్లలకు ఆమె సూచించారు. 

ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని అనిత సూచించారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే తక్షణమే 112కి కాల్ చేయాలని అన్నారు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని వివరించారు. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి అంటూ పిల్లలకు హితవు పలికారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో కూడా అభయ ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Vangalapudi AnitaAbhaya ProgramWomen Safety Andhra PradeshCybercrime Task ForceAnakapalle PoliceShakti App

More Telugu News

పులివెందులలో జగన్ పొలిటికల్ డ్రామా.. ఓటమి భయంతోనే కొత్త నాటకాలు: బీటెక్ రవి

01 Nov, 11:20

హైదరాబాద్‌లో అండాల దందా గుట్టురట్టు.. 43 మంది మహిళలకు విముక్తి

01 Nov, 11:06

'ఇండియా' కూటమి, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు.. ఢిల్లీలో వేలమంది పోలీసులతో కనీవినీ ఎరుగని భద్రత

01 Nov, 10:44

పార్టీలు కాదు.. పనిచేసే నాయకులకే పట్టం కట్టాలి: బాలకృష్ణ

01 Nov, 10:21

జర్మనీలో హింసాత్మకంగా మారిన జెన్-జీ నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ

01 Nov, 10:12

48 ఏళ్లుగా నీళ్లు తాగని వారెన్ బఫెట్.. దానికి బదులుగా ఆయన ఏం తాగుతారో తెలుసా?

01 Nov, 10:06

ఎన్నికల బరిలో అనూహ్య పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న వైసీపీ అభ్యర్థి

01 Nov, 09:54

ఏపీ మున్సిపల్ ఎన్నికలు: ఓటేసిన బాలకృష్ణ, ఇతర నేతలు

01 Nov, 09:47

ఇరాన్‌లో మరిన్ని లక్ష్యాలున్నాయ్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

01 Nov, 09:36

రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ సభ.. ఢిల్లీలో హైఅలర్ట్

01 Nov, 09:23

రాప్తాడు ఘటన: చిన్నారికి సర్జరీ.. విద్యార్థులకు కౌన్సెలింగ్.. రంగంలోకి మంత్రి లోకేశ్

01 Nov, 09:02

వైభవ్‌ను పక్కనపెట్టడం సరికాదు: టీమిండియాపై కైఫ్ విమర్శలు

01 Nov, 08:53

సన్నబియ్యం ధరలకు కళ్లెం.. తెలంగాణలో గరిష్ఠ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం

01 Nov, 08:34

ఢిల్లీ ర్యాలీపై వినూత్న పిలుపు.. నిరసనతో పాటు షాపింగ్ కూడా చేయాలన్న రాహుల్

01 Nov, 08:32

కడప, పులివెందులలో టెన్షన్.. వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య తోపులాట

01 Nov, 08:11
..More Telugu News