కొడుకును కత్తెరతో పొడిచి చంపిన తల్లి... కారణం ఇదే!
- మద్యానికి బానిసైన కొడుకును హత్య చేసిన తల్లి
- డబ్బుల కోసం వేధించడంతో అనంతపురంలో దారుణం
- కత్తెరతో గొంతులో పొడవడంతో అక్కడికక్కడే మృతి
- తల్లి సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మద్యానికి బానిసై వేధిస్తున్న కన్నకొడుకును కన్నతల్లే హతమార్చిన విషాద ఘటన అనంతపురం నగరంలో చోటుచేసుకుంది. కుమారుడి వేధింపులు భరించలేకే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అనంతపురం పట్టణంలో నివసిస్తున్న సునీతకు సురేంద్ర (28) అనే కుమారుడు ఉన్నాడు. సురేంద్ర మద్యానికి బానిస కావడమే కాకుండా, తరచూ డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. ఈ క్రమంలోనే వారి ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుండేవి.
ఘటన జరిగిన రోజు సైతం సురేంద్ర మద్యం మత్తులో ఇంటికి వచ్చి డబ్బుల కోసం తల్లితో వాగ్వాదానికి దిగాడు. మాట మాట పెరగడంతో, కొడుకు వేధింపులు భరించలేని సునీత ఆవేశంతో సహనం కోల్పోయింది. వెంటనే కత్తెర తీసుకుని సురేంద్ర గొంతులో బలంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితురాలు సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమెపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.