Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మన దేశంలో వ్యాపారం చేసే 'వోల్టాస్' కంపెనీ ఎక్కడిదో తెలుసా?

Do you know the origin of the Voltas company doing business in our country
Advertisement
  • భారత ప్రముఖ ఏసీ బ్రాండ్ వోల్టాస్‌కు స్విస్ మూలాలు
  • బ్రిటిష్ ఇండియాలో వోల్కార్ట్ బ్రదర్స్ అనే స్విస్ సంస్థ వ్యాపారం
  • 1954లో టాటా సన్స్‌తో కలిసి వోల్టాస్‌గా ఏర్పాటు
  • పత్తి వ్యాపారంతో మొదలై ఏసీల మార్కెట్‌ను శాసించిన వైనం
Advertisement
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు భారతీయులు అత్యధికంగా ఆశ్రయించే ఎయిర్ కండిషనర్ బ్రాండ్లలో 'వోల్టాస్' అగ్రగామిగా ఉంది. అయితే, ఈ ప్రముఖ బ్రాండ్ వెనుక బ్రిటిష్ ఇండియా కాలం నాటి ఒక స్విస్ వ్యాపార సామ్రాజ్య వారసత్వం దాగి ఉందన్న విషయం చాలామందికి తెలియదు. అనేకమంది ఇప్పటికీ వోల్టాస్ ను భారతీయ కంపెనీ అనే అనుకుంటారు. 

1954లో టాటా సన్స్‌తో చేతులు కలిపి వోల్టాస్‌ను ఆవిష్కరించిన 'వోల్కార్ట్ బ్రదర్స్' అనే స్విస్ కంపెనీ విజయగాథ ఇది.

స్విట్జర్లాండ్ అధికారికంగా ఏ దేశాన్నీ తన వలస రాజ్యంగా చేసుకోకపోయినా, యూరప్ వలసవాద నెట్‌వర్క్‌ల ద్వారా ఆర్థికంగా విశేష ప్రయోజనం పొందింది. బ్రిటిష్ ఇండియా కాలంలో, 1851లో 'వోల్కార్ట్ బ్రదర్స్' అనే స్విస్ సంస్థ బొంబాయి కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పట్లో బ్రిటిష్ వారు నిర్మించిన రైల్వేలు, ఓడరేవులను వినియోగించుకుంటూ పత్తి వ్యాపారంలో ఆ సంస్థ అగ్రగామిగా అవతరించింది. క్రమంగా సుగంధ ద్రవ్యాలు, కాఫీ, ఇంజనీరింగ్ ఉత్పత్తుల రంగాల్లోకి విస్తరిస్తూ, 1920ల నాటికి ఎయిర్ కండిషనింగ్ మార్కెట్‌లోకి ప్రవేశించింది.

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత విదేశీ కంపెనీలపై నిబంధనలు కఠినతరం కావడంతో, వోల్కార్ట్ బ్రదర్స్ 1954లో టాటా సన్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. స్విస్ ఇంజనీరింగ్ నైపుణ్యం, టాటా గ్రూపు పెట్టుబడి కలయికతో  "వోల్టాస్ లిమిటెడ్" ఆవిర్భవించింది. అనతికాలంలోనే ఇది భారతదేశంలో అతిపెద్ద ఏసీ తయారీ సంస్థగా ఎదిగింది. 2026 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా ఏసీ యూనిట్లను విక్రయించి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది.
Advertisement
Advertisement
Voltas
Tata Sons
Volkart Brothers
Air Conditioners
Swiss Engineering
Indian AC Market

More Telugu News