భూమిపైకి ఏలియన్లా?.. సంచలన వీడియోలు బయటపెట్టిన అమెరికా

Science
Advertisement
  • యూఎఫ్‌వోలకు సంబంధించిన కొత్త ఫైళ్లు విడుదల
  • 40 పత్రాలు, వీడియోలు, ఆడియోలను బయటపెట్టిన పెంటగాన్‌
  • 28 ఏళ్ల సర్వీసులో చూడని వస్తువని పైలట్‌ వ్యాఖ్య
  • అణ్వాయుధ కేంద్రం వద్ద రహస్య వస్తువు కలకలం
  • చైనా సమీపంలోనూ అనుమానాస్పద వస్తువుల వీడియోలు
  • యూఎఫ్‌వో వెబ్‌సైట్‌లో ఫైళ్లను అందుబాటులో ఉంచిన అమెరికా
Advertisement
అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్‌) గుర్తు తెలియని ఎగిరే వస్తువులు (యూఎఫ్‌వోలు/యూఏపీలు)కు సంబంధించిన కొత్త ఫైళ్లను విడుదల చేసింది. మొత్తం 40 ఫైళ్లను తన అధికారిక యూఎఫ్‌వో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వీటిలో 14 పత్రాలు, 19 వీడియోలు, నాలుగు ఆడియోలు, మూడు ఫొటోలు ఉన్నాయి. ఈ సమాచారం పెంటగాన్‌తో పాటు నాసా, సీఐఏ, ఎఫ్‌బీఐ, ఇంధన శాఖ వంటి అమెరికా ప్రభుత్వ సంస్థల నుంచి సేకరించారు. ఎక్కువ భాగం 2010 తర్వాత నమోదైన ఘటనలకు సంబంధించినవే.

వీటిలో 2019లో అమెరికా తూర్పు ప్రాంతంలో జరిగిన ఒక ఘటన ఆసక్తికరంగా మారింది. ఓ సైనిక పైలట్‌ తన 28 ఏళ్ల వైమానిక దళం, నౌకాదళ సేవలో ఇలాంటి వస్తువును ఎప్పుడూ చూడలేదని నివేదికలో పేర్కొన్నాడు. చిన్న ఆకారంలో ఉన్న ఆ వస్తువు అత్యంత వేగంగా నేరుగా ప్రయాణించిందని, 10 నుంచి 15 సెకన్ల పాటు దాన్ని గమనించి వీడియో కూడా తీశామని తెలిపాడు. జూమ్‌ చేసి చిత్రీకరించేలోపే అది కెమెరా పరిధి దాటి మాయమైందని వివరించాడు.

మరో నివేదికలో 2015లో టెక్సాస్‌లోని పాంటెక్స్‌ అణ్వాయుధ కేంద్రం గగనతలంలో గుర్తు తెలియని వస్తువు సంచరించినట్లు వెల్లడైంది. అది ఎలాంటి శబ్దం లేకుండా కదిలిందని భద్రతా సిబ్బంది పేర్కొన్నారు. అలాగే 2023, 2025లో చైనా సమీపంలోని ఎల్లో సీ, ఈస్ట్‌ చైనా సీ ప్రాంతాల్లో కూడా అనుమానాస్పద వస్తువులను సైనిక సెన్సార్లు గుర్తించిన వీడియోలను పెంటగాన్‌ విడుదల చేసింది. అయితే ఇవి గ్రహాంతరవాసుల వాహనాలేనని అమెరికా ప్రభుత్వం ఎక్కడా నిర్ధారించలేదు. ప్రస్తుతం వాటి స్వభావంపై దర్యాప్తు కొనసాగుతోంది.
Advertisement

సంబంధిత వార్తలు

PentagonUFO videosUnidentified Aerial PhenomenaAlien sightingsUS Defense DepartmentNASA CIA UFO files

More Telugu News

సింగిల్స్‌కు బంపరాఫర్‌.. ప్రేమను వెతుక్కుంటూ ఫిన్‌లాండ్‌కు వెళ్లండి.. ఖర్చంతా వాళ్లదే!

01 Nov, 15:43

పులివెందులలో ఓటు వేయకుండానే వెనుదిరిగిన జగన్

01 Nov, 15:38

పండగ బోనస్‌ వచ్చిందా? తొందరపడి ఖర్చు చేయకుండా ఈ 5 పనులు పూర్తి చేయండి!

01 Nov, 15:18

ముంచుకొస్తున్న 'మురసు' తుపాను.. నెల్లూరుకు 630 కి.మీ దూరంలో కేంద్రీకృతం

01 Nov, 14:57

రాప్తాడు బాలికకు శస్త్రచికిత్సలు విజయవంతం.. పీఐసీయూకి తరలించారు: నారా లోకేశ్

01 Nov, 14:38

ఇషాన్‌, అయ్యర్‌ మెరుపులు.. కివీస్‌ ముందు 192 పరుగుల లక్ష్యం!

01 Nov, 14:36

దుకాణాలను బీజేపీ బలవంతంగా మూసివేయిస్తోంది.. రాహుల్‌ గాంధీ ఆరోపణలు

01 Nov, 14:26

కేంద్ర ఖజానాకు కాసుల వర్షం.. 23 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

01 Nov, 14:23

పులివెందులలో ఉద్రిక్తత: ఆర్వో కార్యాలయం వద్ద జగన్ ధర్నా

01 Nov, 14:21

రాష్ట్రమంతా ప్రశాంతం.. కడపలో వైసీపీ హింసకు ముందే ప్లాన్ చేసింది: మంత్రి లోకేశ్

01 Nov, 14:05

ఫేక్ జగన్, ఫేక్ షెడ్యూల్.. వైసీపీ ఫేక్ ప్రచారం: బీటెక్ రవి

01 Nov, 13:49

టీడీపీపై నెట్టేందుకే దాడులు.. పులివెందుల అరాచకం వెనుక జగన్ డైరెక్షన్: ఎమ్మెల్సీ వర్ల రామయ్య

01 Nov, 13:35

ఏపీలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్.. పట్టణాల్లో జోరు, నగరాల్లో నీరసం

01 Nov, 13:22

టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా?.. జీర్ణ సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనంటున్న నిపుణులు!

01 Nov, 12:51

ఐదో టీ20లో టాస్ కివీస్‌దే.. జట్టులో కీలక మార్పులతో బరిలోకి టీమిండియా

01 Nov, 12:39
..More Telugu News