షేర్‌ మార్కెట్‌లో జోష్‌.. 827 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌

Sensex surges 827 points as Indian stock markets end with huge gains
  • ఒక శాతానికి పైగా లాభపడ్డ సెన్సెక్స్‌, నిఫ్టీ
  • ఐటీ, ఆర్థికం, స్థిరాస్తి రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు
  • కలిసొచ్చిన క్రూడాయిల్‌ ధరల తగ్గుదల
  • లాభాల్లో జియో ఫైనాన్షియల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు
  • డాక్టర్‌ రెడ్డీస్‌, ఎటర్నల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో
దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, ఆర్థికం, స్థిరాస్తి రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో ప్రధాన సూచీలు ఒక శాతానికి పైగా ఎగిశాయి. జూన్‌ త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్లలో ఆశావహ వాతావరణం నెలకొంది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 827.57 పాయింట్లు పెరిగి 77,569.39 వద్ద ముగిసింది. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 244.10 పాయింట్లు ఎగిసి 24,206.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 2 శాతం పెరగడం విశేషం. నిఫ్టీ రియాల్టీ సూచీ 3 శాతానికి పైగా, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ 3 శాతం వరకు ఎగిసింది.

నిఫ్టీ50 సూచీలో జియో ఫైనాన్షియల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ లైప్ వంటి షేర్లు లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, ఎటర్నల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

బ్యాంకుల నుంచి వచ్చిన సానుకూల వ్యాపార అప్‌డేట్లు, ఐటీ రంగంపై ఆశావహ అంచనాలు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. స్థిరమైన ఆదాయ అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వ్యయం పెరిగే అవకాశాలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అవకాశాలు ఐటీ షేర్లపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయని మార్కెట్‌ నిపుణులు తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 1 శాతానికి పైగా తగ్గి 75.41 డాలర్లకు, అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ 71.16 డాలర్లకు పడిపోయింది. ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) కొనుగోళ్లు మళ్లీ పెరగడం కూడా భారత మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయని నిపుణులు పేర్కొన్నారు.
Advertisement
Sensex
Nifty 50
Indian Stock Market
IT Sector Stocks
Share Market Today
NSE BSE News

More Telugu News