హైదరాబాద్‌లో మద్యం మత్తులో బీభత్సం.. నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
- నటుడు ధర్మ ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు
- మద్యం మత్తులో యువకులు డ్రైవింగ్ చేసినట్టు పోలీసుల అనుమానం
- జనగామలో ఆర్టీసీ బస్సును దొంగిలించిన వెంకన్న అనే వ్యక్తి
- తిరుపతి వెళ్లేందుకు రైళ్లు లేకపోవడంతో బస్సుతో పరారీ
- టోల్గేట్ వద్ద పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఫిలింనగర్లో ఇవాళ తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రముఖ నటుడు ధర్మ నివాసంలోకి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. మద్యం మత్తులో ఉన్న యువకులు అతివేగంతో కారు నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
నియంత్రణ కోల్పోయిన కారు, నటుడి ఇంటి గేటును బలంగా ఢీకొట్టి, కాంపౌండ్ వాల్‌ను పడగొట్టి లోపలికి ప్రవేశించింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అర్ధరాత్రి దాటాక పెద్ద శబ్దం రావడంతో నటుడు ధర్మ, ఆయన కుటుంబ సభ్యులు ఉలిక్కిపడి లేచారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్నట్లుగా అనుమానిస్తున్న యువకులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు చోరీ
ఇదిలా ఉంటే.. తెలంగాణలో మరో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా టీజీఎస్ఆర్టీసీకి చెందిన అద్దె బస్సునే దొంగిలించాడు. జనగామ బస్టాండ్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పాలకుర్తికి చెందిన వెంకన్న అనే ట్రాక్టర్ డ్రైవర్ తిరుపతి వెళ్లాలనుకున్నాడు. రైల్వే స్టేషన్‌కు వెళ్లగా, ఆ సమయంలో రైళ్లు లేవని తెలియడంతో నిరాశగా బస్టాండ్‌కు వచ్చాడు. అక్కడ ఆగి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును గమనించాడు. బస్సులోకి ఎక్కి, అందులో ఉన్న టూల్‌కిట్ సాయంతో దాన్ని స్టార్ట్ చేసి, సూర్యాపేట వైపు సుమారు 21 కిలోమీటర్లు నడుపుకుంటూ వెళ్లాడు.
సింగరాజుపల్లి టోల్గేట్ సమీపంలో బస్సును రివర్స్ చేసే ప్రయత్నంలో పదేపదే డివైడర్‌ను ఢీకొట్టడంతో టోల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న వెంకన్నను అరెస్ట్ చేశారు. రెండు వేర్వేరు ఘటనలు అయినా, మద్యం మత్తులో జరిగిన ఈ సంఘటనలు కలకలం రేపాయి.