Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో 'లెనిన్' గ్రాండ్ ప్రీమియర్స్ నేడే!

Akhil Akkineni Lenin Movie Grand Premieres in USA Today
Advertisement
  • అక్కినేని అఖిల్ కొత్త సినిమా 'లెనిన్'
  • యూఎస్ఏలో నేటి నుంచి గ్రాండ్ ప్రీమియర్ షోలు
  • మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం
  • భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన చిత్రం
  • సితార, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో భాగం
Advertisement
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన కొత్త చిత్రం 'లెనిన్' అమెరికాలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్ షోలు నేడు (జులై 9) యూఎస్ఏలో ప్రదర్శించనున్నారు. విభిన్నమైన టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రేపు (జులై 10) రిలీజ్ కానుంది.

ఈ చిత్రానికి మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా, అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్సం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అక్కినేని నాగార్జున ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం విశేషం. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

యూఎస్ఏలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తోంది. "ది వరల్డ్ ఆఫ్ లెనిన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ" అనే ట్యాగ్‌లైన్‌తో ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని రకాల పాసులు చెల్లుబాటు అవుతాయని, ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకోవాలని చిత్ర యూనిట్ కోరింది. ప్రస్తుతం అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు 'లెనిన్' ప్రపంచాన్ని థియేటర్లలో వీక్షించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
Advertisement
Advertisement
Akhil Akkineni
Lenin Movie
USA Premieres
Bhagyashri Borse
Thaman S
Sithara Entertainments

More Telugu News