హరీశ్ రావు అంత నిష్ణాతుడైతే.. కేసీఆర్ ఎందుకు తీసేశారు?: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్!

  • సాగునీటి రంగంపై విమర్శలు గుప్పించిన హరీశ్ కు ఉత్తమ్ కౌంటర్
  • పెద్ద నిష్ణాతుడైనట్టు హరీశ్ మాట్లాడుతున్నారని ఎద్దేవా
  • హరీశ్ విమర్శలకు సరైన సమయంలో సమాధానం చెబుతామని వ్యాఖ్య

సాగునీటి రంగంపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చేసిన విమర్శలపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ... హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


ఇరిగేషన్‌లో హరీశ్ రావు ఏదో పెద్ద నిష్ణాతుడైనట్లు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ ఎద్దేవా చేశారు. "హరీశ్ రావుకు అంత సత్తా ఉంటే, గత ప్రభుత్వంలో ఆయన మామ కేసీఆర్ ఆయనను ఆ శాఖ నుంచి ఎందుకు తొలగించారు? హరీశ్ రావు పనితీరుపై నమ్మకం లేకనే కేసీఆర్ ఆయనను రాత్రికి రాత్రే నీటి పారుదల శాఖ నుంచి తీసేశారు" అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా హరీశ్ రావు ప్రెజెంటేషన్లు ఇస్తున్నారని, ఆయన చూపించిన అబద్ధపు గణాంకాలకు తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. హరీశ్ రావు చేసిన ప్రతి విమర్శకు సరైన సమయంలో, ఆధారాలతో సహా పూర్తి సమాధానం చెబుతామని మంత్రి స్పష్టం చేశారు.


Harish Rao
Uttam Kumar Reddy
Telangana Irrigation
BRS vs Congress
KCR
Telangana Politics

More Telugu News