విదేశీ లుక్, స్వదేశీ అవసరాలు... ఇదే కొత్త హైబ్రిడ్ హోమ్ ట్రెండ్!
- భారతీయ అవసరాలకు అనుగుణంగా మారుతున్న గ్లోబల్ డిజైన్లు
- మినిమలిజంలో తెలుపు బదులు సహజమైన రంగుల వాడకం
- విదేశీ ఫర్నిచర్‌తో పాటు దేశీయంగా తయారైన స్టోరేజీకి ప్రాధాన్యం
- ఇంట్లో కనిపించకుండా కలిసిపోయేలా వర్క్ ఫ్రమ్ హోమ్ స్పేస్‌లు
- మన్నికకే పెద్దపీట వేస్తూ మెటీరియల్స్ ఎంపిక
భారతదేశంలో ఇంటీరియర్ డిజైన్ రంగంలో ఒక కొత్త విప్లవం చోటుచేసుకుంటోంది. విదేశీ డిజైన్లను యథాతథంగా అనుకరించే రోజులు పోయాయి. ఇప్పుడు భారతీయ జీవనశైలి, కుటుంబ అవసరాలు, వాతావరణానికి తగినట్టుగా గ్లోబల్ ట్రెండ్స్‌ను మార్చుకుంటూ 'హైబ్రిడ్ హోమ్' అనే కొత్త కాన్సెప్ట్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆధునిక డిజైన్లకు దేశీయతను జోడించి, అందంతో పాటు ఆచరణాత్మకతకు పెద్దపీట వేయడమే దీని ముఖ్య ఉద్దేశం.
సాధారణంగా గ్లోబల్ మినిమలిజం అంటే తెల్లటి గోడలు, తక్కువ ఫర్నిచర్ ఉంటాయి. కానీ, భారతీయ ఇళ్లలో ఇది బోసిగా కనిపించడంతో పాటు, దుమ్ము స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ 'వార్మ్ మినిమలిజం'కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే, లేత గోధుమ, మట్టి రంగు వంటి సహజమైన రంగులు వాడుతున్నారు. గోడలకు టెక్స్చర్లు, ఫ్లూటెడ్ ప్యానెల్స్, కేన్/రాటన్ యాక్సెంట్లు, కోటా వంటి దేశీయ రాళ్లతో ఇంటికి ప్రత్యేక అందాన్ని తెస్తున్నారు.
యూరోపియన్ ఫర్నిచర్ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా, భారతీయ కుటుంబాలకు అవసరమైన స్టోరేజీ సౌకర్యం వాటిలో తక్కువ. అందుకే, సౌకర్యవంతమైన సోఫాలు, కుర్చీలు వంటివి విదేశాల నుంచి తెప్పించుకుంటూనే... పండుగల సామాన్లు, ఇతర వస్తువులు దాచుకోవడానికి వీలుగా స్థానికంగా హైడ్రాలిక్ బెడ్లు, ఫ్లోర్-టు-సీలింగ్ క్యాబినెట్లను కస్టమైజ్ చేయించుకుంటున్నారు.
ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఇరుకు ఇళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రత్యేక గది కేటాయించడం కష్టం. దీనికి పరిష్కారంగా, అవసరం లేనప్పుడు కనిపించకుండా కలిసిపోయే 'ఇన్విజిబుల్ ఆఫీస్'లు రూపొందిస్తున్నారు. గోడకు అమర్చే మడత డెస్కులు, ఆర్ట్ వెనుక దాగి ఉండే అకౌస్టిక్ ప్యానెల్స్, యాప్ ద్వారా మార్చుకోగల స్మార్ట్ లైటింగ్ వంటివి ఈ ట్రెండ్‌లో భాగమే.
సుస్థిరత విషయంలోనూ భారతీయ దృక్పథం భిన్నంగా ఉంది. త్వరగా పాడైపోయే మెటీరియల్స్ కన్నా, 15-20 ఏళ్లు మన్నేవే అసలైన సస్టైనబిలిటీ అని భావిస్తున్నారు. అందుకే, దృఢమైన ఇంజినీర్డ్ వుడ్, దేశీయ సహజ రాళ్లు, వాతావరణాన్ని తట్టుకునే ఫినిషింగ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా, గ్లోబల్ డిజైన్లను కేవలం అనుకరించకుండా, మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం ద్వారా భారతీయ ఇళ్లు కొత్త కళను సంతరించుకుంటున్నాయి.