ఈ ఏడాది రాయలసీమకు ఎల్‌నినో దెబ్బ... మంత్రి అనిత ఉన్నతస్థాయి సమీక్ష
- ఏపీపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం.. 11 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు
- ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షపాతం లోటు
- వర్షాభావ పరిస్థితులపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష
- ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం
- విపత్తుల వల్ల ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీని కారణంగా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో, ముఖ్యంగా రాయలసీమలో, సాధారణం నుంచి తీవ్రస్థాయిలో వర్షపాతం లోటు నమోదైందని అధికారులు తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ప్రధాన కార్యాలయంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాల పనితీరు, ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు.
ఎల్‌నినో కారణంగా రాయలసీమ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు సమావేశంలో గుర్తించారు. ముఖ్యంగా శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో తీవ్ర వర్షాభావం ఉండగా.. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణ లోటు నమోదైనట్లు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో కరవు పీడిత మండలాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
మరోవైపు, విపత్తుల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. తాగునీరు, విద్యుత్ వంటి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని, పోలీస్, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని మంత్రి అనిత దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.