ఒమన్ క్రికెట్ జట్టుకు కొత్త సారథి: కెప్టెన్‌గా కాన్పూర్ కుర్రాడు వినాయక్ శుక్లా!

Vinayak Shukla appointed as the new captain of Oman cricket team
  • వైస్ కెప్టెన్ నుంచి కెప్టెన్‌గా ప్రమోషన్
  • కాన్పూర్ నుంచి ఒమన్‌కు వలస వెళ్లిన క్రికెటర్
  • అక్కడ డేటా ఆపరేటర్‌గా ఉద్యోగం
  • 2024లో ఖతార్‌పై మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం
ఒమన్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా భారత సంతతికి చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ వినాయక్ శుక్లా పగ్గాలు చేపట్టాడు. దేశ క్రీడా చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయానికి ఆరంభమని ఒమన్ క్రికెట్ బోర్డు అభివర్ణించింది. ఇప్పటివరకు వైస్ కెప్టెన్‌గా సేవలందించిన వినాయక్.. జతీందర్ సింగ్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ ఏడాది భారత్‌లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఒమన్ జట్టుకు జతీందర్ సింగ్ సారథ్యం వహించాడు. జట్టు ఎదుగుదలలో, సాధించిన విజయాలలో వినాయక్ శుక్లా కీలక పాత్ర పోషించాడని, అందుకే అతడికి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నామని సోమవారం సోషల్ మీడియా వేదికగా ఒమన్ క్రికెట్ అధికారికంగా ప్రకటించింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన 32 ఏళ్ల వినాయక్ శుక్లా, మెరుగైన అవకాశాల కోసం ఒక కోచ్ సలహాతో 2021లో ఒమన్‌కు వలస వెళ్లాడు. అక్కడ తన రోజువారీ ఖర్చుల కోసం 'నేషనల్ మెటల్ క్యాన్స్' అనే సంస్థలో డేటా ఆపరేటర్‌గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత క్రికెట్‌లో రాణించి 2024 నుంచి ఒమన్ జాతీయ జట్టుకు ఆడుతున్నాడు.

డిసెంబర్ 14, 2024న ఖతార్‌పై జరిగిన మ్యాచ్‌తో వినాయక్ శుక్లా అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 10, 2025న ఆసియా కప్‌లో నమీబియాపై తొలి వన్డే ఆడాడు. ఇప్పటివరకు ఆడిన 8 వన్డేల్లో 24 సగటుతో 144 పరుగులు చేశారు. అలాగే 13 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో రెండు అర్ధ శతకాలతో 288 పరుగులు సాధించాడు. టీ20ల్లో ఆయన అత్యధిక స్కోరు 52 (నాటౌట్).  
Advertisement
Vinayak Shukla
Oman Cricket Captain
Kanpur Cricketer
Oman National Cricket Team
Indian Born Cricketer
Oman Cricket Board

More Telugu News