Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందరూ ఎదురుచూస్తున్న మెలొడీ... అఖిల్ 'లెనిన్' నుంచి 'జయమంగళం' పాట రిలీజ్

Akhil Akkineni Lenin movie Jayamangalam song released
Advertisement
  • అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రం నుంచి ఆసక్తికరమైన పాట విడుదల
  • 'జయమంగళం' పేరుతో లిరికల్ వీడియోను రిలీజ్ చేసిన మేకర్స్
  • తమన్ స్వరపరిచిన ఈ మెలోడీకి మంచి స్పందన
  • జులై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న 'లెనిన్'
  • నేడు తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ 
Advertisement
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం 'లెనిన్'. ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాటను చిత్రబృందం విడుదల చేసింది. 'జయమంగళం' పేరుతో వచ్చిన ఈ మెలోడీ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను ఆదివారం రిలీజ్ చేశారు. "అందరూ అడిగిన మెలోడీ... అందరూ ఎదురుచూస్తున్న మెలోడీ" అంటూ చిత్ర యూనిట్ ఈ పాటను ప్రేక్షకులకు అందించింది.

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరపరిచిన ఈ మెలోడీ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పాటలోని సాహిత్యం, ట్యూన్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా విడుదలైన ఈ ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్‌గా, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 'లెనిన్' చిత్రాన్ని జులై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నేడు 'లెనిన్' చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. 
Advertisement
Advertisement
Akhil Akkineni
Lenin Movie
Jayamangalam Song
SS Thaman
Sithara Entertainments
Murali Kishor Abburu

More Telugu News