Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒత్తిడికి గుడ్‌బై.. ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలు!

Stress Relief 3 Simple Tips From Psychologist To Relax Instantly
Advertisement
  • ఒత్తిడిని తగ్గించేందుకు 3 సులభ చిట్కాలు
  • ముఖంపై చల్లటి నీరు చల్లుకోవాలని సూచన
  • ప్రత్యేక శ్వాస పద్ధతితో త్వరగా రిలాక్స్‌
  • ప్రకృతి శబ్దాలు వింటే కూడా ప్రయోజనకరం
  • రోజూ వ్యాయామం, నడక అలవాటు చేసుకోవాలి
  • నమ్మిన వారితో మాట్లాడితే ఒత్తిడి తగ్గుతుంది
Advertisement
పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా భవిష్యత్తుపై ఆందోళన... కారణం ఏదైనా, ఒత్తిడి మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే కొన్ని సులభమైన పద్ధతులతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చని సైకాలజిస్ట్‌లు సూచిస్తున్నారు.

ముఖంపై చల్లటి నీళ్లు: ముఖంపై చల్లటి నీళ్లు చల్లుకోవడం వల్ల గుండె వేగం తగ్గి, శరీరం ప్రశాంత స్థితికి చేరుకుంటుంది. ఇది ముఖ్యంగా ఆందోళన, పానిక్‌ అటాక్స్‌ వచ్చినప్పుడు త్వరగా రిలాక్స్‌ కావడానికి ఉపయోగపడుతుంది.

శ్వాస వ్యాయామం: ముందుగా వరుసగా రెండు సార్లు లోతుగా శ్వాస పీల్చుకుని, తర్వాత నెమ్మదిగా ఎక్కువసేపు శ్వాసను బయటకు వదలాలి. ఈ విధానం మెదడులోని అలర్ట్‌ సిస్టమ్‌ను శాంతింపజేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా చేయగలిగే సులభమైన పద్ధతి ఇది.

ప్రకృతిలోని శబ్దాలు వినండి: పక్షుల కిలకిలరావాలు, వర్షం, సముద్ర అలల శబ్దాల వంటి ప్రకృతిలో నుంచి వచ్చే ధ్వనులు మెదడుకు భద్రత భావన కలిగించి ఒత్తిడిని తగ్గిస్తాయి. బయటకు వెళ్లే అవకాశం లేకపోతే మొబైల్‌లో లేదా ఇయర్‌ఫోన్స్‌తో నేచర్‌ సౌండ్స్‌ వినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా ఏం చేయాలి?
ప్రతిరోజూ నడక లేదా వ్యాయామం చేయండి. మొబైల్‌, ఈమెయిల్స్‌కు కొంతసేపు దూరంగా ఉండండి. మీ మనసులోని బాధను నమ్మకమైన వ్యక్తితో పంచుకోండి. ఈ చిన్న అలవాట్లు ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో సాయపడతాయి.
Advertisement
Advertisement
Stress Relief
Mental Health Tips
Psychologist Advice
Anxiety Management
Breathing Exercises
Relaxation Techniques

More Telugu News