విద్యావ్యవస్థలో మార్పు మీరే తేవాలి: ఉపాధ్యాయులకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం

You must bring change in the education system Minister Lokesh directs teachers
  • సింగపూర్ యాత్రకు వెళ్లిన 37 మంది టీచర్లతో మంత్రి లోకేశ్ భేటీ
  • విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని పిలుపు
  • మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు గుర్తింపు ఇస్తామని హామీ
  • అందరం కలిసి 'ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్' సాధిద్దామన్న లోకేశ్
రాష్ట్ర విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని, అందరూ కలిసికట్టుగా కృషి చేసి 'ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్'ను సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లివచ్చిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులతో ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా, సింగపూర్ పర్యటనలో తాము తెలుసుకున్న అధునాతన విద్యా విధానాలు, బోధనా పద్ధతులను ఉపాధ్యాయులు మంత్రికి వివరించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో వాటిని అమలు చేయడానికి ఉన్న అవకాశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను లోకేశ్ ఆసక్తిగా విన్నారు.

అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడంలో ఉపాధ్యాయుల పాత్రే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తప్పకుండా గుర్తింపునిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్యారంగాన్ని ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని లోకేశ్ దిశానిర్దేశం చేశారు.
Nara Lokesh
AP Education Minister
Andhra Pradesh Education Reforms
Singapore Study Tour Teachers
AP Model of Education
Education System Changes

More Telugu News