నా భర్త కంటే మిమ్మల్నే ఎక్కువ ప్రేమిస్తున్నా అంటూ మహిళా అభిమాని బోల్డ్ కామెంట్‌... షారుఖ్ స్పందన

 Shah Rukh Khan responds to fan who loves him more than her husband
  • మంగళూరులో ఈవెంట్ కు హాజరైన షారుఖ్ ఖాన్
  • నమస్కార అంటూ పలకరించి కన్నడిగుల మనసు దోచుకున్న షారుఖ్
  • ఫ్యాన్స్ తో ముఖాముఖి నిర్వహిస్తుండగా ఆసక్తికర సన్నివేశం

ఒక మహిళా అభిమాని చేసిన బోల్డ్ కామెంట్ కు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. కర్ణాటకలోని మంగళూరులో ప్రముఖ రోహన్ కార్పొరేషన్ నిర్వహించిన ఒక ఈవెంట్ లో షారుఖ్ పాల్గొన్నారు. బ్లాక్ క్లాసిక్ డ్రెస్, చేతికి స్టైలిష్ సన్‌గ్లాసెస్‌తో కింగ్ ఖాన్ స్టేజ్ ఎక్కగానే వేలాది మంది ఫ్యాన్స్ కేరింతలతో ఆ ఏరియా అంతా మార్మోగిపోయింది. వేదికపైకి రాగానే కన్నడలో 'నమస్కార' అంటూ పలకరించి కన్నడిగుల మనసులు దోచేశారు. 


ఈ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌తో ముఖాముఖి నిర్వహిస్తున్న సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రేక్షకుల్లో ఉన్న ఒక మహిళా అభిమాని మైక్ తీసుకుని.. “నేను నా భర్త కంటే కూడా మిమ్మల్నే ప్రపంచంలోనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను షారుఖ్!” అని చెప్పింది. ఆ మాట వినగానే స్టేజ్ మీదున్న వారంతా ఒక్కసారిగా సైలెంట్ అయినా... షారుఖ్ ఏమాత్రం తడబడకుండా చిరునవ్వుతో, “ఇలాంటి పర్సనల్ విషయాలు అందరి ముందు కాకుండా ఒంటరిగా చెప్పాలి కదా!” అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చేసరికి హాల్ అంతా నవ్వులతో నిండిపోయింది. “మీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి.. మీ భర్తకు కూడా అవి అర్థమయ్యే ఉంటాయి. ఐ లవ్ యు ఆల్. మీ భర్తను కూడా నేను ప్రేమిస్తున్నాను. మీ మొత్తం కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను” అని చెప్పారు. షారుఖ్ చెప్పిన ఈ మాటలకు నెటిజన్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు.

Shah Rukh Khan
Mangaluru
Rohan Corporation
SRK fan interaction
Bollywood news
Shah Rukh Khan witty response

More Telugu News