Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూరప్ లో భానుడి భగభగలు... ఆసియా దేశాల ఏసీలకు భలే గిరాకీ!

Europe heatwave triggers massive demand for Asian air conditioners
Advertisement
  • పశ్చిమ, దక్షిణ యూరప్‌ను అతలాకుతలం చేస్తున్న తీవ్రమైన వేడిగాలులు
  • పలు దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వందలాది మరణాలు నమోదు
  • ఏసీలకు అమాంతం పెరిగిన డిమాండ్.. ఆసియా కంపెనీలకు భారీ లాభాలు
Advertisement
పశ్చిమ, దక్షిణ యూరప్ దేశాలు ప్రస్తుతం తీవ్రమైన వేడిగాలులతో అట్టుడుకుతున్నాయి. జూన్ నెలలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో, ఎయిర్ కండిషనర్లకు (ఏసీ) అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఈ పరిణామం ఆసియాకు చెందిన ఏసీ తయారీ కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

ఉత్తర ఆఫ్రికా నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరాయి. స్పెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో పలు దేశాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. ఈ తీవ్ర వడగాల్పుల కారణంగా జూన్ 21 నుంచి ఒక్క స్పెయిన్‌లోనే సుమారు 212 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. ఫ్రాన్స్, ఇటలీలలోనూ మరణాలు నమోదవుతుండటంతో ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి.

సాధారణంగా యూరప్ ఖండంలో ఏసీల వినియోగం చాలా తక్కువ. ఫ్రాన్స్‌లో కేవలం 25 శాతం గృహాల్లోనే ఏసీలు ఉండగా, యూరప్ మొత్తంగా చూస్తే ఈ సంఖ్య 20 శాతం లోపే ఉంటుంది. అక్కడి భవన నిర్మాణాలు ప్రధానంగా శీతల వాతావరణానికి అనుగుణంగా రూపొందించబడటంతో, ప్రస్తుతం సంభవిస్తున్న ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోలేకపోతున్నాయి.

ఈ నేపథ్యంలో, ఏసీల కొనుగోళ్లకు ప్రజలు భారీగా మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా శాంసంగ్, ఎల్‌జీ, మిడియా, మిత్సుబిషి ఎలక్ట్రిక్ వంటి ఆసియా కంపెనీల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఫ్రాన్స్, స్పెయిన్‌లలో ఏసీల విక్రయాలు ఏకంగా 108 శాతం వృద్ధి చెందగా, జర్మనీలో 37 శాతం మేర పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో భవిష్యత్తులోనూ యూరప్‌లో ఏసీలకు డిమాండ్ ఇలాగే కొనసాగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Advertisement
Advertisement
Europe Heatwave
Air Conditioner Demand
Asian AC Manufacturers
Samsung LG AC Sales
Climate Change Europe

More Telugu News