టర్బో పెట్రోల్, అడుగు భాగంలో సీఎన్‌జీ సిలిండర్.. మారుతి బ్రెజ్జా సరికొత్తగా..!
- డిజైన్‌తో పాటు ఇంజిన్, ఫీచర్లలో కీలక మార్పులు
- 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో ఫేస్ లిఫ్ట్ వెర్షన్
- బూట్ స్పేస్‌లో కాకుండా అడుగుభాగంలో సీఎన్‌జీ సిలిండర్
- ప్రధాన ఆకర్షణగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
- తొలిసారిగా పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు
కొత్త బ్రెజ్జాలో ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులోకి రానుంది. ఇదే ఇంజిన్‌ను ప్రస్తుతం ఫ్రాంక్స్‌లో ఉపయోగిస్తున్నారు. దీన్ని బ్రెజ్జా కోసం మరింత శక్తిమంతంగా ట్యూన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా పెద్ద మార్పు తీసుకురానున్నట్లు సమాచారం. సిలిండర్‌ను బూట్ స్పేస్‌లో కాకుండా వాహనం అడుగు భాగంలో అమర్చనున్నారు. దీంతో లగేజీ పెట్టుకునేందుకు మరింత స్థలం లభిస్తుంది.
ఫీచర్ల పరంగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవి టాప్ వేరియంట్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు కూడా తొలిసారిగా బ్రెజ్జాలో ఇవ్వనున్నట్లు సమాచారం.