రష్యాకు భారత పెట్రోల్‌.. ఉక్రెయిన్‌ దాడుల ప్రభావం!

Indian petrol to Russia impact of Ukraine attacks
  • ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులతో దెబ్బతిన్న రష్యా రిఫైనరీలు
  • భారత్‌ నుంచి పెట్రోల్‌ దిగుమతులకు రష్యా ప్రణాళిక
  • దిగుమతి కంపెనీలకు సబ్సిడీల ప్రతిపాదన
  • జూన్‌ 2026లో భారత్‌ రష్యా చమురు కొనుగోలు రికార్డు స్థాయికి
  • రష్యాలో రోజుకు 25 వేల టన్నుల పెట్రోల్‌ కొరత
  • ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న పరిస్థితి
ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులతో చమురు శుద్ధి కేంద్రాలు దెబ్బతినడంతో రష్యాలో పెట్రోల్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత్‌ నుంచి పెద్ద ఎత్తున పెట్రోల్‌ దిగుమతి చేసుకునే దిశగా రష్యా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఉక్రెయిన్‌కు చెందిన కీవ్‌ పోస్ట్‌ కథనం ప్రకారం.. భారత్‌ నుంచి సముద్ర మార్గంలో పెట్రోల్‌ దిగుమతులను ప్రోత్సహించేందుకు రష్యా తన పన్ను చట్టాల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. భారత్‌ నుంచి పెట్రోల్‌ దిగుమతి చేసే కంపెనీలకు సబ్సిడీలు అందించే ప్రతిపాదనకు రష్యా పార్లమెంట్‌ బడ్జెట్‌ కమిటీ మద్దతు తెలిపినట్లు సమాచారం.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా ముడి చమురుకు భారత్‌ అతిపెద్ద కొనుగోలుదారుగా మారింది. ప్రస్తుతం రోజుకు 15 లక్షల నుంచి 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును భారత్‌ కొనుగోలు చేస్తోంది. 2026 జూన్‌లో ఈ దిగుమతులు రోజుకు 26.6 లక్షల బ్యారెళ్ల రికార్డు స్థాయికి చేరినట్లు నివేదిక పేర్కొంది.

భారత్‌లోని రిఫైనరీల్లో శుద్ధి చేసిన చమురులో కొంత భాగాన్ని పెట్రోల్‌, ఇతర ఇంధన ఉత్పత్తుల రూపంలో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 2025లో భారత్‌ పెట్రోల్‌ ఎగుమతులు రోజుకు 4 లక్షల బ్యారెళ్ల రికార్డు స్థాయికి చేరాయి. ఉక్రెయిన్‌ దాడుల కారణంగా రష్యా చమురు శుద్ధి సామర్థ్యం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రోజుకు సుమారు 85 వేల టన్నుల పెట్రోల్‌ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. వేసవి కాలంలో డిమాండ్‌ 1.11 లక్షల టన్నుల వరకు ఉంది. దీంతో రోజుకు దాదాపు 25 వేల టన్నుల కొరత ఏర్పడినట్లు నివేదిక వెల్లడించింది.

పెట్రోల్‌ కొరత కారణంగా రష్యాలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే కొందరు తేలికపాటి విమానాల నిర్వాహకులు విమాన ఇంధనానికి బదులుగా ఆటోమొబైల్‌ పెట్రోల్‌ను వినియోగించాల్సి వస్తోందని సమాచారం.
Russia
India petrol exports
Ukraine drone attacks
Russian oil refineries
Gasoline shortage Russia
India Russia fuel trade

More Telugu News