ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఆహ్వానం.. స్వయంగా లేఖ రాసిన ఇరాన్ అధ్యక్షుడు!
- ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఇరాన్ ఆహ్వానం!
- అధ్యక్షుడు పెజెష్కియాన్ స్వయంగా లేఖ రాసిన వైనం
- జులై 4 నుంచి అంత్యక్రియల కార్యక్రమాలు
- జులై 9న మష్హాద్‌లో ఖననం
ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు జులై 4న ప్రారంభం కానున్నాయి. పలు దశల్లో జరిగే నివాళి కార్యక్రమాల అనంతరం జులై 9న ఆయన స్వస్థలమైన మష్హాద్‌లో ఖననం చేయనున్నారు. తెహ్రాన్, ఖోమ్ నగరాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఫిబ్రవరిలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీ మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది. దాదాపు 36 ఏళ్ల పాటు ఆయన ఇరాన్‌కు సుప్రీం లీడర్‌గా సేవలందించారు. అంత్యక్రియలకు కోట్ల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తరఫున కూడా ప్రతినిధి బృందం హాజరుకానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇరాన్ అధ్యక్షుడు తనను కూడా ఆహ్వానించారని షెహ్‌బాజ్ షరీఫ్ వెల్లడించారు.