నేను కేసీఆర్‌ అంత మంచోణ్ని కాదు.. వచ్చే ఐదేళ్లు సినిమా చూపిస్తా: కేటీఆర్

KTR says I am not as good as KCR will show movie to Chitti Naidu team for five years
  • ప్రత్యర్థులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కేటీఆర్
  • మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • సప్తసముద్రాలు దాటినా వెతికి పట్టుకొస్తానని శపథం
  • వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి, ఆయన బృందానికి సినిమా చూపిస్తాన‌న్న కేటీఆర్‌
  • వర్ధన్నపేట కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను త‌న తండ్రి కేసీఆర్ అంత మంచివాడిని కాదని, తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. "వచ్చే ఐదేళ్లు ఏదీ మర్చిపోము. మనల్ని ఇబ్బంది పెట్టినోడిని, మనపై కేసులు పెట్టినోడిని మర్చిపోం. అదే సమయంలో మనతో నిలబడిన వాళ్లను కూడా మర్చిపోం. నేను కేసీఆర్‌ సారంత మంచోడినైతే కాదు. వచ్చే ఐదేళ్లు చిట్టినాయుడుకు, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా విడిచిపెట్టను" అని అన్నారు.

కార్యకర్తలను వేధించిన వారు ఎక్కడున్నా వదలబోమని కేటీఆర్ హెచ్చరించారు. "రిటైరైనా, పారిపోయినా, సప్తసముద్రాల అవతల దాక్కున్నా.. మా కార్యకర్తలను సతాయించిన ఒక్కొక్కడినీ వెతికి తెచ్చి మీ ముందట నిలబెట్టే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్యే లేదు. ఇది ఊరికే చెప్పడం లేదు, గుర్తు పెట్టుకోండి" అని ఆయన వ్యాఖ్యానించారు. 
Go Back to Shorts
KTR
BRS Party
Revanth Reddy
Telangana Politics
K Chandrashekar Rao
Vardhannapet

More Telugu News