ఖమ్మంలో తీవ్ర విషాదం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

Swathi Khammam tragedy Mother poisons two children and attempts suicide
  • ఖమ్మంలో హృదయవిదారక ఘటన
  • ఇద్దరు కుమారులకు విషమిచ్చి, ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం
  • చికిత్స పొందుతూ చిన్నారుల మృతి
  • భర్త తాగుడు, బెట్టింగ్ వేధింపులే కారణమని ఆరోపణలు
  • తండ్రి ఫిర్యాదుతో భర్తపై కేసు నమోదు
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, తల్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఖమ్మం నగరంలోని గాంధీ నగర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. బొబ్బల లింగరాజు, స్వాతి (26) దంపతులకు వేదిక్ కుమార్ (7), తనుష్ (5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లింగరాజుకు మద్యం తాగడం, బెట్టింగ్‌లు కాయడం వంటి దురలవాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన సుమారు రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. భార్య తండ్రి దొడ్డ పూర్ణయ్య ఇచ్చిన నగదును కూడా బెట్టింగ్‌లో పోగొట్టడంతో ఆ కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో, శనివారం రాత్రి పెద్ద కుమారుడు వేదిక్‌కు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వేదిక్ మృతి చెందాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే చిన్న కుమారుడు తనుష్ కూడా అదే లక్షణాలతో ఆదివారం ప్రాణాలు విడిచాడు. పిల్లలకు తానే ఎలుకల మందు ఇచ్చానని, అనంతరం తాను కూడా తీసుకున్నానని స్వాతి తన భర్తతో చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం స్వాతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తన కుమార్తె ఈ దారుణానికి పాల్పడటానికి భర్త లింగరాజు వేధింపులే కారణమని స్వాతి తండ్రి పూర్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఖమ్మం మూడో పట్టణ పోలీసులు లింగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫాదర్స్ డే రోజే ఈ విషాదం చోటుచేసుకోవడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.                                
Go Back to Shorts
Swathi
Khammam
Mother poisons children
Family dispute suicide
Betting debt tragedy
Telangana crime news

More Telugu News