భవిష్యత్తు ఇంధనంపై కొత్త ఆశలు.. భారీగా తగ్గనున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి ఖర్చు!

Green Hydrogen without electricity costs to drop significantly
  • పెట్రో, డీజిల్‌ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా గ్రీన్‌ హైడ్రోజన్‌
  • ప్రస్తుతం దీని ఉత్పత్తి ఖర్చు చాలా ఎక్కువ
  • సోలార్‌తో విద్యుత్‌ ఉత్పత్తి చేసి తర్వాత నీటిలోకి పంపి హైడ్రోజన్‌ను వేరు చేస్తున్న వైనం
  • కొత్త పరిశోధనలో విద్యుత్‌ అవసరం లేకుండా హైడ్రోజన్‌ ఉత్పత్తి
  • ప్యానెళ్ల ద్వారా నేరుగా నీటి నుంచి హైడ్రోజన్‌
భవిష్యత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ వంటి సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా గ్రీన్‌ హైడ్రోజన్‌ను భావిస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి నుంచి పరిశ్రమలు, రవాణా రంగం వరకు అనేక అవసరాలకు ఉపయోగపడే ఈ స్వచ్ఛ ఇంధనాన్ని తక్కువ ఖర్చుతో తయారు చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన ఓ స్టార్టప్‌ కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఎండ, నీటిని ఉపయోగించి నేరుగా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ప్రత్యేక ప్యానెల్‌ను రూపొందించినట్లు ప్రకటించింది.

జర్మనీలోని కార్ల్‌స్రూహే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (కేఐటీ) నుంచి ఏర్పడిన ‘ఫోట్రియాన్‌’ అనే స్టార్టప్‌ ఈ ప్యానెల్‌ను అభివృద్ధి చేసింది. సాధారణంగా గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీకి ముందుగా సోలార్‌ ప్యానెల్‌లతో విద్యుత్‌ ఉత్పత్తి చేసి, దానితో ఎలక్ట్రోలైజర్‌ ద్వారా నీటిని విడదీసి హైడ్రోజన్‌ను పొందుతారు. అంటే రెండు వేర్వేరు వ్యవస్థలు అవసరం అవుతాయి. అయితే ఫోట్రియాన్‌ రూపొందించిన కొత్త ప్యానెల్‌లో ఈ రెండు దశలు అవసరం ఉండవని సంస్థ చెబుతోంది.

ఏప్రిల్‌లో జర్మనీలో నిర్వహించిన హానోవర్‌ మెస్సే వాణిజ్య ప్రదర్శనలో ఒక చదరపు మీటర్‌ విస్తీర్ణం గల నమూనా ప్యానెల్‌ను సంస్థ ప్రదర్శించింది. ఈ ప్యానెల్‌ సూర్యరశ్మిని గ్రహించి, నీటిలోని అణువులను నేరుగా విడదీసి హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లుగా మారుస్తుంది. ఇందులో ఎక్కడా విద్యుత్‌ ఉత్పత్తి జరగదు. ‘ఫోటోక్యాటలిసిస్‌’ అనే ప్రక్రియ ఆధారంగా ఈ సాంకేతికత పనిచేస్తుంది.

హైడ్రోజన్‌ ఉత్పత్తి  ఖర్చు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాజా పరిశోధన కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. తక్కువ ఖర్చుతో భారీ స్థాయిలో తయారు చేయగలిగే విధంగా ప్యానెళ్లను రూపొందించినట్లు ఫోట్రియాన్‌ వెల్లడించింది. చిన్న పరిశ్రమల నుంచి భారీ సౌర హైడ్రోజన్‌ కేంద్రాల వరకు వీటిని వినియోగించే అవకాశం ఉందని పేర్కొంది.
Go Back to Shorts
Fotrian
Green Hydrogen
Karlsruhe Institute of Technology
Photocatalysis
Germany
Renewable Energy

More Telugu News