నా జీవితంలో అత్యుత్తమ ఉద్యోగం అదే.. రోహిత్ ను దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది: జాంటీ రోడ్స్
- రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన జాంటీ రోడ్స్
- ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ ఉద్యోగం తనకు అత్యుత్తమని వ్యాఖ్య
- మైదానంలో రోహిత్ సరదాగా ఉంటాడన్న జాంటీ
ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రమాదకర ఓపెనర్లలో ఒకడిగా పేరుగాంచిన రోహిత్ శర్మపై దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్-అఫ్ఘనిస్థాన్ వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ ప్రతిభ, నాయకత్వం, బ్యాటింగ్ శైలిని వివరిస్తూ జాంటీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్‌గా 2009 నుంచి 2017 వరకు పనిచేసిన జాంటీ రోడ్స్... ప్రఖర్ గుప్తా యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ, “నా జీవితంలోనే అత్యుత్తమ ఉద్యోగం అది. ఎందుకంటే రోహిత్ శర్మను దగ్గరగా గమనించే అవకాశం లభించింది” అని అన్నారు.
రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంత సులభంగా, సహజంగా కనిపిస్తుందో వివరిస్తూ... “చాలా మంది ఆటగాళ్లు గంటల తరబడి కఠినంగా సాధన చేస్తారు. కానీ రోహిత్ మైదానంలోకి వచ్చి పరిస్థితిని అర్థం చేసుకుని ఆడతాడు. ఇది అతని సహజ ప్రతిభ మాత్రమే కాదు, స్థిరత్వం, క్రమశిక్షణ వల్ల సాధ్యమైంది” అని ప్రశంసించారు.
రోహిత్ నాయకత్వ శైలిని కూడా జాంటీ మెచ్చుకున్నారు. “అతని కెప్టెన్సీ ఎన్నో సంవత్సరాలుగా మారలేదు. మైదానంలో సరదాగా ఉంటాడు, సహచరులతో హాస్యం చేస్తాడు, స్టంప్ మైక్‌లో వినిపించే అతని వ్యాఖ్యలు అతని స్వభావాన్ని చూపిస్తాయి. ధోనీలా లేదా కోహ్లీలా మారాల్సిన అవసరం లేదు. ప్రతి నాయకుడు తన స్టైల్లోనే విజయం సాధించవచ్చు” అని అన్నారు.
రోహిత్ బ్యాటింగ్‌ను కేఎల్ రాహుల్‌తో పోల్చిన జాంటీ... “ఇద్దరూ బ్యాటింగ్‌ను చాలా సులభంగా కనిపించేలా ఆడతారు. శారీరక దృఢత్వంలో రాహుల్ ముందుంటాడు కానీ, బంతిని టైమ్ చేసే రోహిత్ సహజ టైమింగ్ అద్భుతం” అని వ్యాఖ్యానించారు.