వైట్‌హౌస్‌పై బాంబు డ్రోన్లు, స్నైపర్లతో దాడికి ప్లాన్.. ముందే పసిగట్టి ముంచేసిన ఎఫ్‌బీఐ
- వైట్‌హౌస్ ఈవెంట్‌పై దాడి కుట్ర భగ్నం
- ఐదుగురు ఉగ్ర కుట్రదారుల అరెస్ట్
- ట్రంప్ పుట్టినరోజే దాడికి స్కెచ్
- నిందితుడి తల్లి సమాచారంతో గుట్టురట్టు
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్ (White House) సౌత్ లాన్‌లో భారీ ఎత్తున నిర్వహించిన 'యూఎఫ్‌సీ ఫ్రీడమ్ 250' (UFC Freedom 250) మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్‌ను టార్గెట్ చేస్తూ జరిగిన ఒక ఘోర ఉగ్ర కుట్రను అమెరికా భద్రతా సంస్థ ఎఫ్‌బీఐ (FBI) విజయవంతంగా భగ్నం చేసింది. ఈ వేడుకకు హాజరైన ప్రముఖులు, ప్రభుత్వ అధికారులపై పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లు, స్నైపర్ గన్‌లతో దాడి చేసేందుకు ప్లాన్ చేసిన ఐదుగురు నిందితులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. ఓహియో, మిస్సోరి, నెబ్రాస్కా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో జరిపిన మల్టీ-స్టేట్ ఆపరేషన్‌లో వీరంతా పట్టుబడినట్లు జస్టిస్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.
అన్‌సీల్డ్ కోర్టు పత్రాల ప్రకారం.. ప్రభుత్వ వ్యతిరేక కుట్ర సిద్ధాంతాలతో (Anti-government conspiracy theories) ప్రభావితమైన ఈ ముఠా.. మార్చి నుంచి 'సిగ్నల్' (Signal) ఎన్‌క్రిప్టెడ్ యాప్ ద్వారా ఈ దాడికి స్కెచ్ వేసింది. జూన్ 14-15 తేదీల్లో జరిగిన ఈ ఈవెంట్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 80వ పుట్టినరోజు వేడుకలతో కూడుకున్నది కావడంతో దీనిని వారు టార్గెట్ చేశారు. వైట్‌హౌస్ ఉత్తర భాగంలోని భవనాలపై డ్రోన్లతో బాంబు దాడి చేసి తొక్కిసలాట సృష్టించాలని, ఆ భయంతో ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీసే వివిఐపి (VVIP) ప్రయాణికులను ముందే సిద్ధం చేసుకున్న స్నైపర్ల ద్వారా కాల్చి చంపాలని, అవసరమైతే వైట్‌హౌస్ గేట్లను బద్దలు కొట్టుకుని లోపలికి చొరబడాలని వీరు ప్లాన్ చేశారు.
అయితే, జూన్ 10వ తేదీన నిందితుల్లో ఒకరి తల్లి ఇచ్చిన ముందస్తు సమాచారంతో ఎఫ్‌బీఐ, సీక్రెట్ సర్వీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈవెంట్ ప్రారంభానికి ముందే నిందితులైన టైసెన్ ప్రోపర్ (19), బ్రయాన్ ఒమర్ రోవా, మైఖేల్ అలాన్ థామస్, డేనియల్ ఎస్క్రిడ్జ్, అబ్రహం హెర్మోసిల్లో అల్వారెజ్‌లను పట్టుకుని వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేల మంది ప్రేక్షకులు, అధ్యక్షుడు ట్రంప్, యూఎఫ్‌సీ సీఈవో డానా వైట్ సమక్షంలో ఈవెంట్ ప్రశాంతంగా ముగిసింది. ఈ దేశీయ ఉగ్ర నెట్‌వర్క్‌తో సంబంధమున్న మరో 23 మందిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.