ఈ20 పెట్రోల్ వాడితే ఇన్సూరెన్స్ రాదా? కేంద్రం క్లారిటీ..
- ఈ20 ఇంధనంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
- బీమా క్లెయిమ్లు తిరస్కరిస్తారన్న వార్తలను ఖండించిన కేంద్రం
- వాహన బీమా పాలసీలపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టీకరణ
- అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని పీఐబీ సూచన
- దేశవ్యాప్తంగా ఈ20, ఈ85 ఇంధనాల విస్తరణకు కేంద్రం చర్యలు
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఈ20 ఇంధనం కారణంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తిరస్కరిస్తారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ప్రజలు ఇలాంటి సమాచారాన్ని నమ్మే ముందు అధికారిక వనరుల ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించింది.
ఇక దేశవ్యాప్తంగా ఇథనాల్ మిశ్రమ ఇంధన వినియోగాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారాన్ని తగ్గించడం, ఇంధన భద్రత పెంచడం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
ఈ20 ఇంధనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ85 ఇంధనాన్ని కూడా ప్రారంభించింది. ప్రస్తుతం 48 పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉన్న ఈ ఇంధనాన్ని 2026 చివరి నాటికి 500 కేంద్రాలకు, 2027 చివరి నాటికి 5 వేల కేంద్రాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.