‘డార్లింగ్ సీఎం విజయ్’.. హీరో విశాల్ ఆసక్తికర పోస్ట్
- కాలేజ్ రోజుల నుంచే ఆ పిలుపు కొనసాగుతోందన్న నటుడు
- పదవి మారినా విజయ్ వ్యక్తిత్వం మారలేదని వ్యాఖ్య
- బొకే, శాలువా ఇవ్వకుండా ప్రత్యేకంగా అభినందనలు
- పేద బాలికల విద్య కోసం ఆ మొత్తాన్ని వినియోగించినట్లు వెల్లడి
సోషల్ మీడియాలో పంచుకున్న సందేశంలో విజయ్ సినీ రంగంలో ఎదిగిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఓ యువ నటుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం సూపర్‌స్టార్ స్థాయికి చేరిందని కొనియాడారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఎన్నో విమర్శలు, సవాళ్లను మౌనంగా ఎదుర్కొంటూ విజయాన్ని సాధించారని కొనియాడారు.
ముఖ్యమంత్రి పదవి వచ్చినా విజయ్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని విశాల్ వెల్లడించారు. చాలా ఏళ్ల క్రితం ఎలా కలిసేవారో, ఇప్పటికీ అదే ఆప్యాయత కనిపించిందన్నారు. గతంలో కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఉదయనిధి వంటి నేతలతో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఇక ముఖ్యమంత్రిని కలిసినప్పుడు సంప్రదాయంగా బొకే, శాలువా ఇవ్వకుండా ఆ ఖర్చును ముగ్గురు నిరుపేద బాలికల విద్య కోసం వినియోగించినట్లు విశాల్ వెల్లడించారు. ఈ సాయాన్ని సీఎం విజయ్ పేరుతో అందించినట్లు తెలిపారు. ఆ బాలికలు జీవితాంతం ఆయన్ను గుర్తుంచుకుంటారని చెప్పారు. విజయ్ పాలనలో తమిళనాడు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ తన సందేశాన్ని ముగించారు.