ఎడారికి వెళ్లినా మీటింగులు తప్పవా?.. సహారాలో ల్యాప్‌టాప్‌తో వ్యక్తి.. వీడియో వైరల్!
- సహారా ఎడారిలో ఒంటెపై ల్యాప్‌టాప్‌తో పనిచేస్తున్న వ్యక్తి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌పై పేలుతున్న జోకులు
- ఎక్కడికి వెళ్లినా మీటింగులు తప్పవంటూ నెటిజన్ల కామెంట్స్
న్యూయార్క్‌కు చెందిన రీల్ క్రియేటర్ సాద్ అక్తర్ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఒంటె మూపురంపై ల్యాప్‌టాప్ పెట్టుకుని సీరియస్‌గా పనిచేస్తున్న వ్యక్తిని వీడియో తీశారు. "వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే మీ స్నేహితుడు" అనే క్యాప్షన్‌ను వీడియోకు జోడించారు. అంతేకాకుండా "మా వాడు సహారా ఎడారి నుంచి మీటింగ్‌లకు అటెండ్ అవుతున్నాడు" అంటూ చమత్కరించారు.
ఈ విచిత్ర దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. 'వర్క్ ఫ్రమ్ ఎనీవేర్'కు ఇదే అసలైన ఉదాహరణ అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు ఫన్నీగా స్పందించారు. ఆఫీస్ మీటింగులు, డెడ్లైన్ల నుంచి తప్పించుకోవడానికి సహారా ఎడారికి వెళ్లినా లాభం లేదని జోకులు వేస్తున్నారు. దీంతో ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి