దేశ ప్రగతికి అంకితభావంతో పనిచేస్తున్నారు.. కిషన్‌రెడ్డిపై మోదీ ప్రశంసలు
- కిషన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా మోదీ శుభాకాంక్షలు
- కష్టపడే నాయకుడని ప్రశంసలు
- బొగ్గు, గనుల రంగంలో సంస్కరణలు చేపట్టారని కితాబు
- అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులూ శుభాకాంక్షలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కిషన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని ఇంధన రంగంలో స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలన్న మోదీ లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం కిషన్‌రెడ్డి సేవలను ప్రశంసించారు. బొగ్గు, గనుల రంగాల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం ఆయన చేస్తున్న కృషి దేశ పురోగతికి దోహదపడుతోందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు కూడా కిషన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.