హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
- జీడిమెట్ల ప్రాంతంలోని గాజులరామారంలో అద్దె ఇంటిపై దాడులు
- ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న బంగ్లాదేశీయులు
- జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలింపు
తదుపరి న్యాయపరమైన చర్యల కోసం వారిని మెదక్ జిల్లా జోగిపేటలో ఉన్న డిపోర్టేషన్ కేంద్రానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వారి భారత్ ప్రవేశం, నివాసం, ఇతర వివరాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. బెంగాల్ లోని సువేందు అధికారి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గుర్తింపు–తొలగింపు–దేశ బహిష్కరణ’ (Identify-Remove-Deport) విధానంలో భాగంగా అక్రమ వలసదారులపై చర్యలు మరింత కఠినతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా అదే తరహా తనిఖీలు జరగడం గమనార్హం.