బైక్‌పై ల్యాప్‌టాప్‌తో పని.. వీడియో షేర్ చేసి సజ్జనార్ హెచ్చరిక
- బైక్‌పై వెళుతూ ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్న వీడియోను షేర్ చేసిన సజ్జనార్
- 'వర్క్ ఫ్రమ్ బైక్' అంటూ ప్రాణాలతో చెలగాటమాడొద్దని హెచ్చరిక
- ఏకాగ్రత తప్పితే మీకే కాదు, ఇతరులకూ ప్రమాదమని హితవు
- పొట్టకూటి కోసం చేసే పని ప్రాణాలు తీసేలా ఉండకూడదని వ్యాఖ్య
దీనిపై స్పందించిన సజ్జనార్, "ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఇంత ఆత్రుత ఎందుకు? ఆత్రం ఎక్కువైతే ప్రాణాల మీదకు వస్తుంది" అని హెచ్చరించారు. రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది కేవలం సదరు వ్యక్తికే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుందని ఆయన గుర్తుచేశారు.
"కడుపు నింపుకోవడానికి చేసే పని, ప్రాణాలను కడతేర్చేలా ఉండకూడదు" అని ఆయన వ్యాఖ్యానించారు. రోడ్లపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలకు స్వస్తి పలికి, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ హితవు పలికారు.