చంద్రబాబుకి ఆరోగ్యం, శక్తి కలగాలి: బుద్దా వెంకన్న
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
- బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ
- వయసు పెరిగినా చంద్రబాబు రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారని కితాబు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించగా... పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. మహిళలు అమ్మవారికి సారె సమర్పించి రాష్ట్రం శాంతి, సుభిక్షాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బుద్దా వెంకన్న... ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మరింత పురోగతి అందించేలా చంద్రబాబుకి ఆరోగ్యం, శక్తి కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
అలాగే గత ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న అవకతవకలను ప్రజలు గమనించారని, అందుకే ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు కూటమికి బలమైన మద్దతు అందించారని గుర్తుచేశారు. వరదలు వంటి ప్రకృతి విపత్తులను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. వయసు పెరిగినా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు.