ఢిల్లీలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
- నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం అనంతరం ప్రత్యేక సమావేశం
- తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ
- వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో జరిగిన నీతి ఆయోగ్ భేటీ
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో 'వికసిత్ భారత్ 2047' లక్ష్యంతో నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాలు పెంపు, ఉపాధి కల్పన, ఆరోగ్యం వంటి అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.