రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది: కిషన్ రెడ్డి

  • సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
  • రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారని విమర్శలు
  • కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారని వ్యాఖ్య
  • విదేశీ వ్యామోహంతో ప్రజల సమస్యలు మరచిన రేవంత్‌కు అదే గతి తప్పదన్న కిషన్ రెడ్డి
  • తెలంగాణలో పాలన మారినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టిన గతే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అబద్ధపు హామీలు, అసమర్థ పాలనతో ప్రజాగ్రహానికి గురై ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తూ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారం మారినా ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరడం లేదని విమర్శించారు. అడ్డగోలు హామీలు, నమ్మకద్రోహంతో క్షేత్రస్థాయి సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. సొంత దేశంలో జరుగుతున్న అభివృద్ధిపై విమర్శలు చేస్తూ, విదేశాలపై వ్యామోహం చూపించడం ఇద్దరు ముఖ్యమంత్రుల్లోనూ చూశామని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను పట్టించుకోకుండా విదేశీ భాషలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. చేతగాని పాలన అందిస్తున్న నేతల గ్రాఫ్ పాతాళానికి పడిపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.

Kishan Reddy
Revanth Reddy
KCR
Telangana Politics
Congress Government
BJP Telangana

More Telugu News